రేవంత్ వల్లే నేను ఎలిమినేట్ అయ్యాను.. నేహా కన్నీరుమున్నీరు!

బిగ్ బాస్ హౌస్ లో ఆదివారం వచ్చింది అంటే చాలు ఎంటర్టైన్మెంట్ కావాల్సినంత ఉంటుంది.అలాగే చివర్లో ఏం జరుగుతుందో టెన్షన్ కూడా ఉంటుంది.

మొదట గేమ్స్ ఆడిస్తూ కంటెస్టెంట్స్ అందరినీ నవ్విస్తూ చివరిలో ఒకరిని ఎలిమినేట్ చేసి అందర్నీ ఏడిపిస్తారు హోస్ట్ నాగార్జున. ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ తో సుత్తి దెబ్బ అనే ఒక ఆటను ఆడించారు నాగార్జున.

అలా ఒక్కొక్క కంటెస్టెంట్ మరో కంటెస్టెంట్ తలపై సుత్తితో కొడుతూ హోస్ట్ నాగార్జున అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.ఆ తర్వాత మళ్లీ హౌస్ మేట్స్ తో జంతువుల బొమ్మలు ఇచ్చి దాంతో కూడా ఒక టాస్క్ ను ఆడించారు నాగార్జున.

ఇక చివరిగా నామినేషన్స్ లో వాసంతి,నేహాలు ఉన్నారు.వారిద్దరి ఫోటోలను తులాభారంలో ఉంచి ఎవరి బరువు తక్కువగా ఉంటే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు అని చెప్పాడు పోస్ట్ నాగార్జున.

Advertisement

అప్పుడు నేహా ఎలిమినేట్ అయ్యి అక్కడ నుంచి బయటకు వచ్చేసింది.స్టేజ్ మీదకు వచ్చిన తర్వాత ఎమోషనల్ అయ్యింది నేహా.

అప్పుడు హోస్ట్ నాగార్జున ఒక టాస్క్ ఇచ్చాడు.హౌస్ లో ఉన్న వారిలో ఐదుగురిని దమ్ము ఉన్న కెటగీరిల,మరొక ఐదుగురిని దుమ్ము కేటగిరీలో పెట్టమని చెప్పగా దుమ్మున్న కేటగిరీలో ఆరుగురిని పెడతానంటూ ఇనయా, రేవంత్‌​, ఆరోహి, అర్జున్‌, వాసంతి, గీతూ ఫోటోలను పెట్టింది.

ఆ తరువాత రేవంత్‌ గురించి చెబుతూ అతని వల్లనే నేను ఎలిమినేట్‌ అయ్యానని చెప్పుకొచ్చింది.ఆ తర్వాత హౌస్ లో ఉన్న ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటూ ఎమోషనల్ అయింది నేహా.మరి ముఖ్యంగా రాజ్ తో తనకున్న బాండింగ్ గురించి చెప్పుకుంటూ మరింత ఎమోషనల్ అయింది నేహా.

రాజ్ తో మొదటినుంచి తన కుండా బంధం గురించి చెబుతూ కొన్నేళ్లుగా ఏ అబ్బాయిని తన జీవితంలోకి రానివ్వలేదు అని కానీ రాజు ద్వారా తనకు ఒక మంచి ఫ్రెండ్ దొరికాడని.మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ బయటకు వచ్చిన తర్వాత కూడా మా ఫ్రెండ్ షిప్ ని కంటిన్యూ చేస్తాము.

ఈ హోమ్ మేడ్ టోనర్ ను వాడితే మొటిమలు దరిదాపుల్లోకి కూడా రావు!

రాజ్ బయటకు వచ్చిన తర్వాత నేను నీ బాడీ గార్డ్ ని అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయింది నేహా.

Advertisement

తాజా వార్తలు