ఈవీ వెహికల్ కొన్నవారికి భారీ షాక్‌.. జులై 1 నుంచి కొత్త నిబంధనలు?

ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా రోడ్లమీద ఎలక్ట్రిక్‌ వెహికల్స్ ( Electric vehicle )పరిగెడుతున్నాయి.

కరోనా తరువాత ఆయిల్స్ రేట్స్ ఆకాశాన్నంటడంతో అప్పటికే వాడుతున్న డీసెల్, పెట్రోల్ వెహికల్స్ ని పక్కనబెట్టి జనాలు ఎలక్ట్రిక్‌ వెహికల్స్ వైపు మళ్లారు.

అయితే తాజాగా ఎలక్ట్రిక్‌ వాహనాలను కొనాలనుకున్నవారికి కేంద్రం షాకిచ్చినట్టు తెలుస్తోంది.విషయం ఏమంటే, ఎలక్ట్రిక్‌ బైక్‌ల వినియోగాన్ని ప్రోత్సహించేలా కొనుగోలు దారులకు అందించే సబ్సీడీని భారీగా తగ్గించనుంది.

దీంతో ఈవీ బైక్స్‌ ధరలు ఆకాశాన్నంటనున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

అవును, కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ పర్యావరణ హితమైన విద్యుత్‌ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేలా ఓ స్కీంను ప్రవేశ పెట్టింది.అదే ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్‌-2) స్కీం.ఈ పథకంలో భాగంగా విద్యుత్ వాహనాల కొనుగోలుపై ఒక కేడబ్ల్యూహెచ్‌( KWH )కు వున్న రూ.10వేల సబ్సిడీని రూ.15 వేలకు పెంచి వేసింది.దాంతో వాహనం ఖరీదులో 20 శాతమే అందించే సబ్సిడీని సైతం 40 శాతానికి పెంచడం గమనార్హం.

Advertisement

ఇప్పుడా 40 శాతం సబ్సీడీని 15 శాతానికి తగ్గిస్తూ కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారికంగా నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.

కాగా తగ్గించిన సబ్సీడీ జూన్‌ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు భోగట్టా.గత ఏప్రిల్‌ నెలలో ఈవీ వాహనాల కొనుగోళ్లు చాలా ఎక్కువగా పెరిగినట్లు తెలుస్తోంది.21 శాతం వృద్దితో గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ నెల వరకు 1,10,503 యూనిట్లు అమ్ముడు పోగా ఇదే నెలలో దేశంలోని ఉత్తర్‌ ప్రదేశ్‌, మహరాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌లలో మొత్తం కలుపుకొని 21,845 వెహికల్స్‌ను కొనుగోలు చేయడం విశేషం.ఇలాంటి పరిస్థితులలో రానున్న రోజుల్లో మరిన్ని వాహనాలు అమ్ముడు కానున్నాయి.

ఇలాంటి శుభ తరుణంలో తాజా కేంద్రం నిర్ణయం ఎటు దారి తీస్తుందో చూడాలి.

పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు