లైగర్‌కు బిగ్ రిలీఫ్.. గోవాలో భారీ యాక్షన్ షెడ్యూల్!

కరోనా సెకండ్ వేవ్ తరువాత చాలా సినిమాలు వారివారి సినిమాల షూటింగ్ లలో బిజీగా ఉన్నాయి.

ఇప్పటికే మధ్యలో నిలిచిపోయిన సినిమాలన్నీ సెట్స్ పైకి వెళ్లి శరవేగంగా షూటింగ్ పనులను పూర్తి చేసుకుంటున్నాయి.

అయితే విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి "లైగర్" చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఈ సినిమాపై పలు అనుమానాలను వ్యక్తం చేశారు.ఇప్పటి వరకు ఈ సినిమా తదుపరి షెడ్యూల్ చిత్రీకరణ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఈ సినిమాపై సందేహాలు వ్యక్తం అవుతున్న క్రమంలో చిత్రబృందం ఈ సినిమాకు సంబంధించి సరికొత్త అప్డేట్ విడుదల చేస్తూ అందరి అనుమానాలను దూరం చేశారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను గోవాలో చిత్రీకరణ చేయాలని పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు.

Liger, Goa, Tollywood, Vijay Devarakonda,latest Tollywood News

దాదాపు నెల రోజుల పాటు షూటింగ్ జరుపుకునే ఈ షెడ్యూల్ లో భాగంగా యాక్షన్ సన్నివేశాలతో పాటు సీరియస్ బాక్సింగ్ ఎపిసోడ్ సన్నివేశాలను టాకీ సన్నివేశాలను గోవాలో చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.ఈ షెడ్యూల్ ముగిసిన తర్వాత చివరి షెడ్యూల్ లో భాగంగా ఈ సినిమా విదేశాలలో చిత్రీకరణ జరుపుకోనుందని చిత్ర బృందం వెల్లడించారు.ఈ క్రమంలోనే యూనిట్ సభ్యులు వచ్చేవారం గోవా వెళ్తున్నట్లు తెలియజేశారు.

Advertisement
Liger, Goa, Tollywood, Vijay Devarakonda,latest Tollywood News -లైగర్

ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే మొట్ట మొదటిసారిగా తెలుగు తెరపై సందడి చేయనున్నారు.ఛార్మి- కరణ్ జోహార్- అపూర్వ మెహతాతో పాటు పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు
Advertisement

తాజా వార్తలు