Actress Akanksha Dubey: ఆత్మహత్యకు ముందు ఫుల్ ఎమోషనలైన నటి.. అసలేం జరిగిందంటే?

ఇటీవల కాలంలో భోజ్‌పురి సినిమా శ్రమలో బుల్లితెర నటుల వరుస ఆత్మహత్యలు కలకలం సృష్టిస్తున్నాయి.అందులో ఎక్కువగా నటిమణులే ఉండడం ఆశ్చర్య పోవాల్సిన విషయం.

ఇది ఇలా ఉంటే తాజాగా మరో భోజ్‌పురి యువ నటి ఆకాంక్ష దూబే( Actress Akanksha Dubey ) అనే 25 ఏళ్ళ నటి ఆత్మహత్యతో భోజ్‌పురి చిత్రసీమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.ఆమె మరణంతో ఒక్కసారిగా భోజ్‌పురి పరిశ్రమలో( Bhojpuri ) విషాద ఛాయలు అలముకున్నాయి.

తోటి నటీనటులు అభిమానులు ఆమె మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.

కాగా తాజాగా ఒక సినిమా షూటింగ్‌ కోసం వారణాసి వెళ్లిన ఆకాంక్ష ఆదివారం అక్కడి హోటల్‌ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.అంత చిన్నవయసులో బలవన్మరణానికి పాల్పడేంత కష్టం ఏమొచ్చింది అంటూ అభిమానులు కంటతడి పెట్టుకుంటున్నారు.ఇది ఇలా ఉంటే ఆకాంక్ష ఆత్మహత్య చేసుకోవడానికి ఒక రోజు ముందు రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌కి వచ్చింది.

Advertisement

అయితే ఇంస్టాగ్రామ్ లైవ్ లోకి( Instagram Live ) వచ్చిన ఆమె ఆ సమయంలో ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది.దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తూ కాసేపు అలాగే స్క్రీన్ వైపు చూస్తూ ఒక్కసారిగా ఉన్నపలంగా కంటతడి పెట్టుకుంది.

ముఖానికి చేతులు అడ్డం పెట్టుకుని వెక్కివెక్కి ఏడ్చేసింది.

ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా ఆ వీడియో చూసిన ఫాన్స్ అది సూసైడ్‌ కాదని ఆమెను మెంటల్‌ గా ఎవరో టార్చర్‌ చేశారు అని ఆరోపిస్తున్నారు.అంతే కాకుండా ఆ విషయం పై విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు ఫాన్స్.

ఇకపోతే ఆకాంక్ష కొంతకాలంగా సహనటుడు సమర్ సింగ్‌తో ప్రేమలో ఉంటున్న విషయం తెలిసిందే.ఇటీవలే తన ప్రేమను అధికారికంగా వెల్లడిస్తూ అతనితో కలిసి ఉన్న ఫోటోలను కూడా సోషల్‌ మీడియాలో షేర్ చేసింది.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు