రిలీజ్‌కు ముందే లీకైన భీమ్లా నాయక్.. నిజమా లేక స్టంటా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ మరికొద్ది గంటల్లో రిలీజ్ కాబోతుందని అభిమానులు వెయ్యి కళ్లతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.

కానీ ఈ సినిమా అప్‌డేట్ రిలీజ్ అయ్యేలోపే లీకు రాయుళ్లు తమ పనితనం చూపించేశారు.సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’ రీమేక్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ రివీల్‌ను ఆగస్టు 15న ఉదయం 9.45 గంటలకు రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.అయితే అప్పుడే ఈ ఫస్ట్ గ్లింప్స్‌కు సంబంధించిన ఫోటోలు ఆన్‌లైన్‌లో దర్శనమిచ్చాయి.

ఇవి చూసి యావత్ చిత్ర యూనిట్ అవాక్కయ్యింది.ఇంకా రిలీజ్ కూడా కాని గ్లింప్స్‌లోని షాట్స్‌ను ఎవరు రిలీజ్ చేశారని వారు వాకబు చేస్తున్నారు.

ఇలా సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తిని కొందరు తమ స్వంత లాభాల కోసం ముందే లీక్ చేయడం ఏమాత్రం సబబు కాదని చిత్ర యూనిట్ సభ్యులు వాపోతున్నారు.అయితే కొందరు మాత్రం ఇదంతా కేవలం పబ్లిసిటీ స్టంట్ అని, చిత్ర యూనిట్ సభ్యుల్లో ఎవరో ఒకరు కావాలనే సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చేందుకు ఇలాంటి పనులకు ఒడిగడుతున్నారనే వాదన కూడా ప్రేక్షకుల్లో వినిపిస్తోంది.

Advertisement

ఇక ఈ లీకైన గ్లింప్స్‌లో భీమ్లా నాయక్ ప్రత్యర్ధులను ఉతికి ఆరేసే సీన్ ఉండబోతున్నట్లు మనకు తెలుస్తోంది.లుంగీతోనే ఎంట్రీ ఇచ్చిన భీమ్లా నాయక్ నోట ఎలాంటి డైలాగ్ వస్తుందో తెలియాలంటే మాత్రం ఈ ఫస్ట్ గ్లింప్స్ టీజర్ అధికారికంగా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

మరి ఈ గ్లింప్స్‌లో మరో హీరో రానా దగ్గుబాటిని చూపిస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు