భట్టి మాటలన్నీ వట్టి మాటలే.. హరీశ్ రావు

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు( Harish Rao) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ప్రభుత్వం సన్న వడ్లకే బోనస్ ఇస్తాననడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు.

తెలంగాణలో యాసంగిలో దొడ్డు వడ్లే పండుతాయన్న హరీశ్ రావు పండని సన్న వడ్లకు ఎలా బోనస్ ఇస్తారని ప్రశ్నించారు.కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందన్నారు.

రైతుబంధు పాక్షికంగా ఇచ్చారన్న హరీశ్ రావు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్మల్ సభలో రైతు భరోసా ఇచ్చామన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు.డిప్యూటీ సీఎం భట్టి ( Deputy CM Bhatti )మాటలన్నీ వట్టి మాటలనేనని చెప్పారు.

బోనస్ అంతా బోగస్ అని హరీశ్ రావు విమర్శించారు.

Advertisement
చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత... అదే నా కోరిక అంటూ?

తాజా వార్తలు