వర్షాకాలంలో ఈ విధంగా హెయిర్ వాష్ చేసుకుంటే ఊహించని లాభాలు మీ సొంతం

వేసవికాలం వెళ్లి వర్షాకాలం రానే వచ్చింది.అనేక ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి.

అయితే ఈ వర్షాకాలంలో అనారోగ్య సమస్యలతో పాటు జుట్టు సంబంధిత సమస్యలు కూడా ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి.వాతావరణంలో వచ్చే మార్పులు, వర్షాల్లో ఎక్కువగా తడవడం లాంటి కారణాల వల్ల జుట్టు అధికంగా రాల‌డం, చుండ్రు, కురులు డ్రై గా మారడం, జుట్టు నుంచి చెడు వాసన రావడం తదితర సమస్యలు తలెత్తుతుంటాయి.

అయితే వీటన్నిటికీ చెక్ పెట్టే ఒక సొల్యూషన్ ఉంది.ఇప్పుడు చెప్పబోయే విధంగా హెయిర్ వాష్ చేసుకుంటే పైన చెప్పుకున్న సమస్యలన్నింటినీ సులభంగా తరిమికొట్టొచ్చు.

అదే సమయంలో మరెన్నో లాభాలను సైతం తమ సొంతం చేసుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం వర్షాకాలంలో జుట్టు ఆరోగ్యం కోసం ఏ విధంగా హెయిర్ వాష్ చేసుకుంటే మంచిదో తెలుసుకుందాం పదండి.

Advertisement
Best Way To Avoid Hair Problems During Monsoon! Hair Problems, Monsoon, Latest N

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు( Flax seeds ), వన్ టేబుల్ స్పూన్ మెంతులు, రెండు రెబ్బలు వేపాకు, రెండు రెబ్బలు కరివేపాకు( Curry leaves ), వన్ టేబుల్ స్పూన్ ఎండిన ఉసిరికాయ ముక్కలు, అంగుళం కచ్చాపచ్చాగా దంచిన ములేటి చెక్క, నాలుగు లవంగాలు వేసుకోవాలి.

Best Way To Avoid Hair Problems During Monsoon Hair Problems, Monsoon, Latest N

ఆపై రెండు గ్లాసుల వాటర్ పోసి బాగా కలిపి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నెను పెట్టుకోవాలి.నాన‌బెట్టుకున్న పదార్థాలను వాటర్ తో సహా వేసుకుని ప‌ది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు ఉడికించాలి.

ఆపై స్టవ్ ఆఫ్ చేసి వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు రెగ్యులర్ షాంపూ వేసి బాగా మిక్స్ చేయాలి.

Best Way To Avoid Hair Problems During Monsoon Hair Problems, Monsoon, Latest N

ఈ వాటర్ ను ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ విధంగా హెయిర్ వాష్ చేసుకుంటే జుట్టు రాలడం చాలా వరకు కంట్రోల్ అవుతుంది.కుదుళ్ళు స్ట్రాంగ్ గా మారతాయి.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!

చుండ్రు సమస్య దూరం అవుతుంది.జుట్టు డ్రై అవ్వడం తగ్గుతుంది.

Advertisement

కురులు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతాయి.స్కాల్ప్ లోతుగా శుభ్రం అవుతుంది.

జుట్టు నుంచి చెడు వాసన రాకుండా ఉంటుంది.మరియు జుట్టు చిట్లడం, విరగడం వంటివి సైతం తగ్గుతాయి.

తాజా వార్తలు