వెయిట్ లాస్ కు సహాయపడే బెస్ట్ టీలు ఇవే.. మీ డైట్ లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి!

ప్రస్తుత రోజుల్లో కోట్లాది మంది అధిక బ‌రువు ( Overweight )సమస్యతో సతమతం అవుతున్నారు.బ‌రువు పెర‌గ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి.

ఏదైనా అధిక బ‌రువు అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను తెచ్చిపెడుతుంది.మ‌న‌లో ఆత్మ‌ధైర్యాన్ని దెబ్బ తీస్తుంది.

అందుకే బరువు తగ్గడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.కఠినమైన డైట్ ను ఫాలో అవ్వడమే కాకుండా రోజు చెమటలు చిందేలా వర్కౌట్లు చేస్తుంటారు.

అయితే అదనపు బరువును తగ్గించడానికి కొన్ని కొన్ని టీలు అద్భుతంగా సహాయపడతాయి.వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

వెయిట్‌ లాస్ కు సహాయపడే బెస్ట్ టీస్‌లో గ్రీన్ టీ ( Green tea )ముందు వరుసలో ఉంటుంది.గ్రీన్ టీను రోజుకు ఒకటి లేదా రెండు కప్పులు తీసుకుంటే క్యాలరీలు చాలా త్వరగా బర్న్ అవుతాయి.

దాంతో శరీర బ‌రువు వేగంగా అదుపులోకి వస్తుంది.అలాగే గ్రీన్ టీ ను తీసుకోవడం వల్ల గుండె పోటు వచ్చే రిస్క్ తగ్గుతుంది.

బెల్లీ ఫ్యాట్ మాయం అవుతుంది మరియు చర్మం గ్లోయింగ్ గా సైతం మెరుస్తుంది.

వెయిట్ లాస్ కు సహాయపడే మరొక అద్భుతమైన టీ పిప్పర్మెంట్ టీ( Peppermint tea ).ఈ టీని రెగ్యులర్ గా తీసుకుంటే సూప‌ర్ ఫాస్ట్ గా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.పైగా ఈ టీ ని తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారుతుంది.

jamuna, Relangi : రేలంగి మాటలకు హీరోయిన్ జమున జంప్..కారణం ఏంటి ?

గ్యాస్, ఎసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం, మలబద్ధకం వంటివి దరిదాపుల్లోకి ఉంటాయి.మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Advertisement

ఒత్తిడి, డిప్రెషన్ వంటివి దూరం అవుతాయి.

ఇక చమోమిలే టీ( Chamomile tea )(చామంతి టీ)తోనూ వేగంగా బరువు తగ్గవచ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.ఈ టీ రోజుకు ఒక కప్పు తీసుకుంటే చాలు మెటబాలిజం రేటు చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది.దాంతో సూపర్ ఫాస్ట్ గా వెయిట్ లాస్ అవుతారు.

అలాగే ఈ టీ ను తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.మోకాళ్ళ నొప్పులు ఉంటే తగ్గు ముఖం పడతాయి.

మరియు ఇమ్యూనిటీ సిస్టం సైతం బూస్ట్ అవుతుంది.

తాజా వార్తలు