ప్రెగ్నెన్సీ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే మీ బ్రేక్‌ఫాస్ట్‌లో దీనిని చేర్చండి!

పెళ్లైన త‌ర్వాత చాలా మంది స్త్రీలు ప్రెగ్నెన్సీ కోసం తెగ ఆరాట‌ప‌డుతుంటారు.అమ్మ అనే పిలుపు కోసం ఆతృత‌గా ఎదురు చూస్తుంటారు.

అయితే ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకునే వారు క‌నీసం ఆరు నెల‌ల ముందు నుంచే అనేక జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.ముఖ్యంగా చెడు ఆహార‌పు అల‌వాట్ల‌ను వ‌దిలిపెట్టి.

డైట్‌లో పోష‌కాహారం ఉండేలా చూసుకోవాలి.అలాగే ఆరోగ్యకరమైన గర్భధారణకు ఇప్పుడు చెప్ప‌బోయే స్మూతీ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

మ‌రి ఆ స్మూతీ ఏంటీ.? దాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.? మ‌రియు ఎప్పుడు తీసుకోవాలి.? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు వేయించిన ఓట్స్‌, వ‌న్ టేబుల్ స్పూన్ అవిసె గింజ‌లు, వ‌న్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్, వ‌న్ టేబుల్ స్పూన్ సన్ ఫ్లవర్ విత్త‌నాలు, వ‌న్ టేబుల్ స్పూన్ గుమ్మ‌డి గింజ‌లు, మూడు గింజ తొల‌గించిన ఖ‌ర్జూరాలు, ఒక క‌ప్పు వాట‌ర్‌ వేసుకుని బాగా క‌లిపి నైటంతా నాన‌బెట్టుకోవాలి.

Advertisement

ఉద‌యాన్నే బ్లెండ‌ర్ తీసుకుని అందులో ఒక అర‌టి పండు, నైట్ అంతా నాన‌బెట్టుకున్న ప‌దార్థాలు, నాలుగు పొట్టు తొల‌గించిన బాదం ప‌ప్పులు, ఒక గ్లాస్ ఫ్యాట్ లెస్ మిల్క్‌, రెండు టేబుల్ స్పూన్ల పీన‌ట్ బ‌ట‌ర్ వేసుకుని మెత్త‌గా గ్రైండ్ చేసుకుంటే.సూప‌ర్ టేస్టీ అండ్ హెల్తీ బయోటిన్ స్మూతీ సిద్ధ‌మైన‌ట్లే.ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూస్తున్న స్త్రీ వారంలో క‌నీసం మూడు సార్లు ఈ స్మూతీని బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకుంటే చాలా మంచిది.

ఈ స్మూతీలో ఉండే ప‌లు పోష‌కాలు మ‌హిళ‌ల్లో సంతానోత్ప‌త్తి అవ‌కాశాల‌ను పెంచుతాయి.గ‌ర్భాశ‌య స‌మ‌స్య‌లు ఏమైనా ఉంటే.వాటిని స‌మ‌ర్థ‌వంతంగా నివారిస్తాయి.

మ‌రియు వెయిట్ లాస్‌కు సైతం ఈ స్మూతీ గ్రేట్‌గా హెల్ప్ చేస్తుంది.

కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?
Advertisement

తాజా వార్తలు