ఈ స్క్ర‌బ్‌ను వారంలో ఒక్క‌సారి వాడితే మీ ముఖం మెరిసిపోవ‌డం ఖాయం!

కాలుష్యం, దుమ్ము, ధూళి, ఎండ‌ల ప్ర‌భావం, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే స్కిన్ ప్రోడెక్ట్స్‌ను వాడ‌టం వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల చ‌ర్మంపై డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోతూ ఉంటాయి.

దాంతో చ‌ర్మం ఛాయ త‌గ్గి జీవం కోల్పోయిన‌ట్లు అయిపోతుంది.

అందుకే డెడ్ స్కిన్ సెల్స్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తొల‌గించుకుంటూ ఉండాలి.అందుకు ఇప్పుడు చెప్ప‌బోయే స్క్ర‌బ్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

ఈ స్క్ర‌బ్‌ను వారంలో ఒకే ఒక్క‌సారి వాడారంటే మీ ముఖం మెరిసిపోవ‌డం ఖాయం.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ స్క్ర‌బ్‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఓ చూపు చూసేయండి.

ముందుగా ఒక చిన్న క్యారెట్ తీసుకుని పీల్ తొల‌గించి వాట‌ర్‌లో శుభ్రంగా క‌డిగి ముక్క‌లుగా క‌ట్ చేయాలి.ఈ ముక్క‌ల‌ను మిక్సీ జార్‌లో వేసి మెత్త‌గా పేస్ట్ చేసి జ్యూస్‌ను స‌ప‌రేట్ చేసుకోవాలి.

Advertisement

ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఐదు టేబుల్ స్పూన్ల బ్రౌన్ షుగ‌ర్‌, వ‌న్ టేబుల్ స్పూన్ అలోవెర జెల్, వ‌న్ విట‌మిన్ ఇ క్యాప్సుల్ ఆయిల్‌, వ‌న్ టేబుల్ స్పూన్ రైస్ బ్రాన్ ఆయిల్‌, పావు స్పూన్ ప‌సుపు మ‌రియు రెండు టేబుల్ స్పూన్ల క్యారెట్ జ్యూస్ వేసుకుని మిక్స్ చేసుకుంటే స్క్ర‌బ్ సిద్ధ‌మైన‌ట్టే.

ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి మ‌రియు మెడ‌కు ప‌ట్టించి.వేళ్ల‌తో రెండు నిమిషాల పాటు స్మూత్‌గా స్క్ర‌బ్ చేసుకోవాలి.అనంత‌రం కూల్ వాటర్‌తో చ‌ర్మాన్ని శుభ్ర ప‌రుచుకుని.

ఏదైనా మాయిశ్చ‌రైజ‌ర్‌ను పూసుకోవాలి.వారంలో ఒక్క‌సారి ఈ స్క్ర‌బ్‌ను యూజ్ చేస్తే గ‌నుక‌.

చ‌ర్మంపై పేరుకు పోయిన డెడ్ స్కిన్ సెల్స్‌తో పాటు మురికి కూడా తొల‌గి పోయి ముఖం కాంతి వంతంగా, అందంగా మెరుస్తుంది.కాబ‌ట్టి, ఈ సింపుల్ అండ్ సూప‌ర్ స్క్ర‌బ్‌ను త‌ప్ప‌కుండా ట్రై చేయండి.

వీడియో వైరల్‌ : కారుతో పెట్రోల్‌ పంప్‌ ఉద్యోగిపైకి దూసుకెళ్లిన పోలీసు..
Advertisement
" autoplay>

తాజా వార్తలు