వ్యవసాయం( Agriculture ) చేసే రైతులు కొన్ని మెలకువలు పాటిస్తే తక్కువ శ్రమతో అధిక దిగుబడి పొందవచ్చు.
అయితే వ్యవసాయనికి నీటి తడులు ఎంత ప్రధానమైనవో రైతులకు బాగా తెలుసు.
నీటిని పొలం అంతా పారిస్తే ఎక్కువ మొత్తంలో నీరు వృధా అవ్వడంతో పాటు అనవసర కలుపు మొక్కలు పొలం అంతా మొలకెత్తుతాయి.అయితే పొలానికి నీటిని అందివ్వడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి.
ఆ పద్ధతులను పాటిస్తే నీరు చాలా వరకు ఆదా అవుతుంది.
ఒక నీటి ట్యాంకులు ఎత్తైన ప్రదేశంలో ఏర్పాటు చేసి, ఒక సన్నని ప్లాస్టిక్ పైప్ లో నీటి ఒత్తిడిని పెంచి వర్షపు జల్లులుగా నీరు మొక్కలపై పడేలా స్ప్లింకర్ ద్వారా నీటిని విడుదల చేయాలి.
ఒక ఎత్తైన ప్రదేశంలో నీటి ట్యాంక్ ఏర్పాటు చేసి, రంద్రాలు ఉన్న పైపులు నేలపై అమర్చి ఆ పైప్ ద్వారా నీటిని పారించాలి.అవసరం అయినంత మేరకు మాత్రమే నీటిని పారిస్తే కలుపు సమస్య తక్కువగా ఉంటుంది.ఈ పద్ధతిలో నీటి ద్వారా మొక్కకు కావలసిన పోషకాలను కూడా అందించవచ్చు.
తోటను చిన్నచిన్న మడులుగా ఏర్పాటు చేసుకోవాలి.ఒక మడుగులో ఆరు చెట్లు వరకు ఉండేటట్లు చూసుకొని నీటిని అందిస్తే నీరు వృధా అవదు.
చెట్ల వరుసల మధ్య నాగలితో 15-20 సెంటీమీటర్ల లోతులో చాళ్ళు ఏర్పాటు చేసి నీటిని పారించాలి.చిన్న మొక్కలకు ఒక చళ్ళు ఉంటే సరిపోతుంది.ఈ చాళ్లలో నీరు కొన్ని గంటల వరకు నిలిచేలా నీటిని అందించాలి.
ఇలా చేస్తే కలుపు సమస్య ఉండదు.
ఈ పద్ధతిలో ప్రతి చెట్టు వద్ద గుండ్రంగా లేదా చదరంగా గట్టు వేసి లోపలి భాగాన్ని చదును చేయాలి.ఈ పద్ధతిలో నీటి కాలువలు చెట్ల వరుసల మధ్య చేసి, కాలువ ద్వారా చెట్టుకు నీరు పారించాలి.ఇలా చేస్తే చాలా నీరు ఆదా అవుతుంది.
చాలావరకు కలుపు సమస్య ఉండదు.అంటే పొలానికి నేరుగా నీటిని వదలకుండా పైపుల ద్వారా, పైన చెప్పిన పద్ధతుల ద్వారా నీటిని అందిస్తే శ్రమతో పాటు కలుపు సమస్యలు దాదాపుగా తగ్గుతాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy