షుగ‌ర్ పేషెంట్ల‌కు బెస్ట్ హెర్బ‌ల్ టీ..రోజూ తీసుకుంటే ఎన్ని లాభాలో!

షుగ‌ర్ వ్యాధి లేదా మ‌ధుమేహం.నేటి రోజుల్లో కోట్లాది మందిని ప‌ట్టిపీడిస్తోంది.

డయాబెటిస్ అని కూడా అనబడే ఈ దీర్ఘ‌కాలిక వ్యాధి.

ఒక్క‌సారి వ‌చ్చిందంటే జీవిత కాలం దాంతో సావాసం చేయాల్సిందే.

ఇక‌పోతే మ‌ధుమేహం ఉన్న వారిని పాలు, చ‌క్కెర‌తో త‌యారు చేసిన టీ, కాఫీల‌ను త‌గ్గొద్ద‌ని వైద్య నిపుణులు సూచిస్తుంటారు.అయితే వాటి బ‌దులుగా ఇప్పుడు చెప్ప‌బోయే హెర్బ‌ల్ టీని డైట్ లో చేర్చుకుంటే బోలెడన్ని ఆరోగ్య లాభాల‌ను త‌మ సొంతం చేసుకోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ హెర్బ‌ల్ టీ ఏంటో.దాన్ని ఎలా త‌యారు చేసుకోవాలో.

Advertisement

తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్ మెంతులు, హాఫ్ టేబుల్ స్పూన్‌ జీల‌క‌ర్ర‌, హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు, హాఫ్ టేబుల్ స్పూన్ వాము, ఒక క‌ప్పు వాట‌ర్ వేసుకుని రాత్రంతా నాన‌బెట్టుకోవాలి.

ఉద‌యాన్నే స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక‌ గ్లాస్ వాట‌ర్ పోయాలి.వాట‌ర్ హీట్ అవ్వ‌గానే అందులో నైటంతా నాట‌బెట్టుకున్న మెంతులు, జీల‌క‌ర్ర‌, సోంపు, వాము నీటితో స‌హా వేసుకోవాలి.

ఇప్పుడు చిన్న మంట‌పై ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు వాట‌ర్‌ను మ‌రిగించి.స్ట్రైన‌ర్ సాయంతో ఫిల్ట‌ర్ చేసుకోవాలి.

ఇలా ఫిల్ట‌ర్ చేసుకున్న నీటిలో వ‌న్ టేబుల్ స్పూన్ తేనె, వ‌న్ టేబుల్ స్పూన్ లెమ‌న్ జ్యూస్ యాడ్ చేసుకుంటే హెల్తీ హెర్బ‌ల్ టీ సిద్ధ‌మైన‌ట్లే.మ‌ధుమేహం వ్యాధి ఉన్న వారు ఈ హెర్బ‌ల్ టీని రోజుకు ఒక‌సారి తీసుకుంటే ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి.

How Modern Technology Shapes The IGaming Experience
మన భారతీయ సంప్రదాయంలో కొబ్బరికాయకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి?

అలాగే షుగ‌ర్ వ్యాధి వ‌ల్ల వ‌చ్చే నీర‌సం, అల‌స‌ట వంటి స‌మ‌స్య‌ల‌ను ఈ హెర్బ‌ల్ టీ దూరం చేస్తుంది.అంతేకాదు, రోజుకు ఒక క‌ప్పు ఈ హెర్బ‌ల్ టీని తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.గ్యాస్, ఎసిడిటీ, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.

Advertisement

మేధాశక్తిని, ఆలోచనా శక్తి పెరుగుతాయి.రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ చురుగ్గా మారుతుంది.

మ‌రియు బాడీ డిటాక్స్ కూడా అవుతుంది.

తాజా వార్తలు