కంటి చూపు తగ్గినట్టు అనిపిస్తుందా? అయితే వెంటనే దీన్ని డైట్ లో చేర్చుకోండి!

వయసు పైబ‌డే కొద్దీ కంటి చూపు( Eye Sight ) మందగించడం సర్వసాధారణం.కానీ ఇటీవల రోజుల్లో చాలామంది చిన్న వయసులోనే ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.

పదేళ్ల బాలుడిలో సైతం ఈ సమస్య తలెత్తుతోంది.పోషకాల కొరత, మొబైల్ ఫోన్‌ను అధికంగా వినియోగించడం, గంటలు తరబడి టీవీలను చూడటం, ఒత్తిడి తదితర కారణాల వల్ల కంటి చూపు మందగిస్తుంది.

మీకు కూడా కంటి చూపు తగ్గినట్టు అనిపిస్తోందా.? అయితే వెంటనే ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను డైట్‌లో చేసుకొండి.ఈ డ్రింక్( Drink ) కంటి చూపును మెరుగు పరచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ఏంటో దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా రెండు ఆరెంజ్ పండ్లు( Oranges ) తీసుకుని సగానికి కట్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

Advertisement

అలాగే ఒక లెమన్ తీసుకుని సగానికి కట్ చేసి జ్యూస్ తీసి పెట్టుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో ఆరెంజ్ జ్యూస్, లెమన్ జ్యూస్ వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ పొట్టు తొలగించి కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి.చివ‌రిగా పావు టేబుల్ స్పూన్ పసుపు, అరకప్పు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఆపై స్టైనర్ సహాయంతో జ్యూస్ ను ఫిల్టర్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపి నేరుగా సేవించడమే.

డ్రింక్ టేస్ట్ గా ఉండటమే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా ఈ డ్రింక్ లో ఉండే పలు పోషకాలు కంటి చూపును మెరుగు పరచడానికి ఎంతగానో సహాయపడతాయి.

వారంలో కనీసం మూడు సార్లు ఈ డ్రింక్ ను తీసుకుంటే వయసు పైబడిన కళ్ళు చక్కగా కనబడతాయి.

విష్ణువు వరాహవతారం ఎత్తడానికి గల కారణం ఇదే..!

అంతే కాదండోయ్ ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్‌ బూస్ట్ అవుతుంది.జ‌లుబు, ద‌గ్గు వంటి సమస్యలు ఉంటే దూరం అవుతాయి.అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.

Advertisement

క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది.చెడు కొలెస్ట్రాల్ కరిగి గుండె ఆరోగ్యంగా మారుతుంది.

వెయిట్ లాస్ కు కూడా ఈ డ్రింక్ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.ఏ డ్రింక్ ను రోజుకు ఒకసారి తీసుకుంటే క్యాలరీలు చాలా త్వరగా బర్న్ అవుతాయి.

దీంతో వేగంగా వెయిట్ లాస్ అవుతారు.బెల్లీ ఫ్యాట్ సైతం క‌రుగుతుంది.

తాజా వార్తలు