మ‌ధుమేహుల‌కు మామిడాకులు ఓ వ‌ర‌మే.. ఇలా తీసుకుంటే మ‌స్తు బెనిఫిట్స్‌!

మామిడి పండ్లు.పేరు వింటేనే నోరూరుతుంటుంది.

ప్ర‌స్తుత సీజ‌న్‌లో విరి విరిగా ల‌భ్య‌మ‌య్యే పండ్ల‌లో మామిడి పండ్లే ముందు వ‌ర‌స‌లో ఉంటాయి.

రుచి ప‌రంగానే కాదు.

పోష‌కాల ప‌రంగానూ మామిడి పండ్లు రారాజే.అందుకే మామిడి పండ్లు క‌నిపిస్తే.

వాటిని వ‌ద‌ల‌డానికి అస్స‌లు ఇష్ట‌ప‌డరు.అయితే మామిడి పండ్లే కాదు మామిడాకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

Advertisement

మామిడాకుల్లోనూ ఎన్నో విలువైన పోష‌కాలు నిండి ఉంటాయి.ముఖ్యంగా మ‌ధుమేహుల‌కు మామిడాకులు ఓ వ‌ర‌మే అన‌డంలో ఎటువంటి సందేహం లేదు.

మ‌ధుమేహం వ్యాధి గ్ర‌స్తులు ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా మామిడాకుల‌ను తీసుకుంటే.మ‌స్తు హెల్త్ బెనిఫిట్స్‌ను త‌మ సొంతం చేసుకోవ‌చ్చు.

ముందుగా ఒక ఐదారు మామిడాకుల‌ను తీసుకుని నీటితో శుభ్రంగా క‌డిగి ప‌క్క‌న పెట్టుకోవాలి.ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాట‌ర్ పోయాలి.

వాట‌ర్ హీట్ అవ్వ‌గానే అందులో క‌డిగి పెట్టుకున్న మామిడాకుల‌ను తుంచి వేసుకోవాలి.ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు మామిడాకుల‌ను ఉడికించి.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable
Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...

అప్పుడు స్ట్రైన‌ర్ సాయంతో వాట‌ర్‌ను ఫిల్ట‌ర్ చేసుకోవాలి.మ‌ధుమేహం ఉన్న వారు ఈ మామిడాకుల నీటిని రోజుకు ఒక క‌ప్పు చ‌ప్పున ప్ర‌తి రోజు తీసుకుంటే.

Advertisement

అందులో యాంటీమైక్రోబియల్‌ గుణాలు రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచడానికి తోడ్పడతాయి.

అలాగే మ‌ధుమేహం వ్యాధి గ్ర‌స్తుల్లో గుండె జ‌బ్బులు వ‌చ్చే రిస్క్ చాలా ఎక్కువ‌గా ఉంటుంది.అయితే పైన చెప్పిన విధంగా మామిడాకుల నీటిని త‌యారు చేసుకుని తీసుకుంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ క‌రిగి పోయి.గుండె ఆరోగ్య‌వంతంగా మారుతుంది.

త‌ద్వారా హార్ట్ ప్రాబ్లమ్స్ వ‌చ్చే ప్ర‌మాదం త‌గ్గుతుంది.అంతేకాదు, మ‌ధుమేహులు మామిడాకుల‌ నీటిని సేవిస్తే వెయిట్ లాస్ అవుతారు.

చ‌ర్మం య‌వ్వ‌నంగా మెరుస్తుంది.మ‌రియు క్యాన్స‌ర్ వ‌చ్చే రిస్క్ సైతం త‌గ్గు ముఖం ప‌డుతుంది.