అందాన్ని రెట్టింపు చేసే అద్భుత చిట్కాలు ఇవే!

అందంగా కనిపించాలని అందరికి ఉంటుంది.అమ్మాయిలకు అయితే అందం పిచ్చి మరింత ఎక్కువ ఉంటుంది.

అయితే అమ్మాయిలు అందంగా కనిపించేందుకు ప్రతిసారి పార్లర్కి వెళ్లడం, ఫేషియల్ చేయించుకోవడం, ఫేస్ క్రీమ్స్ వాడటం, లోషన్స్ వాడటం వంటివి చేస్తుంటారు.శీతాకాలంలో అయితే మరీ ఎక్కువగా చేస్తుంటారు.

ఎందుకంటే చర్మం పొడిబారడం వంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి.శీతాకాలంలోనూ చర్మం పొడిబారకుండా ఉండేందుకు మాయిశ్చరైజర్స్, లోషన్స్ వంటివి ఉపయోగిస్తుంటారు.

ఇవి కాకుండా మన అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి టమోటా చాలా బాగా ఉపయోగపడుతుంది.మరి ఆ టమోటా చిట్కా ఏంటి? ఎలా ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.ఎంతోమందికి చర్మం మీద చిన్న చిన్న రంధ్రాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.

Advertisement

వాటి వల్ల అందవిహీనంగా కనిపిస్తుంటారు.అలాంటి వారు టమోటో జ్యూస్ ఉపయోగించడం మంచిది అనే చెప్పాలి.

ముందుగా టమోటో జ్యూస్ లో కొద్దిగా నిమ్మరసం కలిపి, అందులో కాటన్ బాల్స్ ను డిప్ చేసి మొహం మొత్తం అప్లై చేసుకోవాలి.పది నిమిషాలు తర్వాత చల్లని నీటితో మొహం కడుక్కోవాలి.

ఇలా ఒక వారం రోజుల పాటు చేస్తే మొహం అందంగా కనిపిస్తుంది.ఎంతోమంది అమ్మాయిలకు ఉండే మొదటి సమస్య మొటిమల సమస్య.

అలాంటి ఈ మొటిమల సమస్యకు టమోటాతో చెక్ పెట్టచ్చు.టమోటాలో ఉండే న్యాచురల్ యాసిడ్స్, విటమిన్స్ మొటిమలకు స్క్రబ్ గా ఉపయోగపడుతుంది.

కలర్స్ తో పని లేకుండా తెల్ల జుట్టును సహజంగానే నల్లగా మార్చుకోండిలా..!

టమోటా జ్యూస్ తో మొహం మీద స్క్రబ్ లా చేసి అరగంట తర్వాత చల్లని నీటితో కడిగితే మొటిమల సమస్య తగ్గిపోతుంది.చర్మంపై జిడ్డు.

Advertisement

ఎంతోమందికి ఇది ఒక పెద్ద సమస్య.అలాంటి ఈ సమస్యను అధిగమించాలంటే టమోటా చిట్కా ఉపయోగించాలి.

టమోటా జ్యూస్ లో కాస్త నిమ్మ రసం కలిపి మసాజ్ చేసి 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో మొహం కడుక్కోవాలి.అంతే జిడ్డు చర్మంలా కాకుండా ఎంతో తాజాగా కనిపిస్తుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ చిట్కాలు పాటించండి.అందంగా తయారవ్వండి.

తాజా వార్తలు