మగవారికి బ్యూటీ టిప్.. అందమైన మెరిసే చర్మం కోసం వారానికి ఒకసారి ఇది ట్రై చేయండి!

ఆడవారే కాదు మగవారు కూడా అందంగా ఆకర్షణీయంగా కనిపించాలని కోరుకుంటారు.కానీ చర్మం ఆడ‌వారు పెట్టేంత శ్రద్ధ మగవారు పెట్టరు.

పైగా ప్ర‌తినిత్యం రోడ్లపై తిరగడం వల్ల దుమ్ము ధూళి చర్మంపై భారీగా పేరుకుపోతూ ఉంటాయి.అవి చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.

స్కిన్ ఏజింగ్( Skin Aging ) తొందరగా స్టార్ట్ అయ్యేందుకు మద్దతు ఇస్తాయి.అందుకే కొంతైనా స్కిన్ విషయంలో మగవారు కేర్ తీసుకోవాలి.

ఇక వారానికి ఒకసారి ఇప్పుడు చెప్పబోయే బ్యూటీ టిప్ ను మగవారు ఫాలో అయితే అందమైన మెరిసే చర్మాన్ని తమ సొంతం చేసుకోవచ్చు.అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ బియ్యం పిండి( rice flour ), వన్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్,( Orange Peel Powder ) వన్ టేబుల్ స్పూన్ పెరుగు( curd ), వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం( lemon juice ) మరియు మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ కొబ్బరిపాలు( Fresh coconut milk ) వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఒకవేళ మీది బాగా ఆయిలీ స్కిన్ అయితే కనుక కొబ్బరి పాలు కు బదులుగా టమాటో జ్యూస్ ను ప్రిఫర్ చేయవచ్చు.

Advertisement

తయారుచేసుకున్న మిశ్రమాన్ని వాటర్ తో వాష్ చేసుకున్న ముఖంపై అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై తడి వేళ్ళతో చర్మాన్ని సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.మగవారు వారానికి ఒకసారి ఈ సింపుల్ హోమ్ రెమెడీని కనుక ఫాలో అయితే చర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన మురికి, మృతకణాలు తొలగిపోతాయి.

చర్మం లోతుగా శుభ్రం అవుతుంది.స్కిన్ బ్యూటిఫుల్ గా మరియు గ్లోయింగ్ గా మెరుస్తుంది.ముడతలు త్వరగా రాకుండా ఉంటాయి.

మచ్చలు ఏమైనా ఉన్నా కూడా క్రమంగా తగ్గుతాయి.కాబట్టి అందమైన మెరిసే చర్మం కోసం మగవారు వారానికి ఒక్కసారి తప్పకుండా ఈ రెమెడీని ట్రై చేయండి.

Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...
Advertisement

తాజా వార్తలు