జాగ్రత్తగా ఉండండి.. ! వారికి రేవంత్ రెడ్డి హెచ్చరిక 

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి రేవంత్ రెడ్డి(Revanth Reddy) దూకుడుగా వ్యవహరిస్తుండడంతో పాటు,  వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

  సొంత పార్టీలోని తన అసమ్మతి వర్గాన్ని దారికి తెచ్చుకునే విషయంలో అనుకున్న మేర సక్సెస్ అయ్యారు .

ఎప్పటికప్పుడు అన్ని విషయాల పైన అధిష్టానం పెద్దల అనుమతి తీసుకుంటూ వారి సూచన మేరకు ముందుకు వెళుతూ,  రాష్ట్రంలోనూ అధిష్టానం పెద్దల వద్ద తనకు ఎటువంటి ఇబ్బంది ఏర్పడకుండా రేవంత్(revanth) జాగ్రత్త పడుతున్నారు.ఆయన పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి కారణంగా పార్టీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో , కొంతమంది ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి తాజాగా వార్నింగ్ ఇచ్చారు.

  నిన్న హైదరాబాద్ మాదాపూర్(Hyderabad Madapur) లోని ఓ హోటల్ లో ఏర్పాటు చేసిన సీఎల్పీ సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

Be Careful Revanth Reddys Warning To Them, Cm Revanth Reddy Pcc Chief, Aicc, Pc

ఈ సందర్భంగా పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యేలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని,  జాగ్రత్తగా మెలిగితే మంచిదని రేవంత్ రెడ్డి సూచించారు.ప్రతి ఎమ్మెల్యే సాయంత్రం నాలుగు గంటల నుంచి 6 గంటల వరకు నియోజకవర్గ ప్రజలను కలిసేందుకు సమయం కేటాయించాలని రేవంత్ సూచించారు .బీసీ జనగణన తరువాత స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని , త్వరలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు(Family card) అందజేస్తామని పేర్కొన్నారు.

Be Careful Revanth Reddys Warning To Them, Cm Revanth Reddy Pcc Chief, Aicc, Pc
Advertisement
Be Careful Revanth Reddy's Warning To Them, CM Revanth Reddy PCC Chief, AICC, Pc

ఈ కార్డు ఆధారంగానే సంక్షేమ పథకాలు అందజేస్తామని రేవంత్ క్లారిటీ ఇచ్చారు.  ఇక ప్రతిపక్షాల విమర్శలను తిప్పుకొట్టే విషయంలోనూ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు అలెర్ట్ గా ఉండాలని రేవంత్ సూచించారు.ఈ సందర్భంగా సిఎల్పీ సమావేశంలో పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మహేష్ కుమార్ గౌడ్ ( Mahesh Kumar Goud) ను రేవంత్ రెడ్డి సన్మానించారు.

ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) తో పాటు,  పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.వీరితో పాటు బీ ఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పిఎసి చైర్మన్ ఆరికేపూడి గాంధీ,  కడియం శ్రీహరి(Arikepudi Gandhi, Kadiam Srihari) తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు