ఏ నదిలో స్నానం చేయడం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?

పురాణాల ప్రకారం మనిషి నిద్రించిన తరువాత శవంతో సమానం అని చెబుతారు.

మనం నిద్ర పోయేటప్పుడు పంచేంద్రియాలు పని చేస్తేనే మనం జీవంతో ఉన్నాము అని భావిస్తారు అందుకోసమే నిద్రలేచిన వెంటనే శుభ్రంగా స్నానం చేయాలని పండితులు చెబుతుంటారు.అయితే చాలామంది పూర్వకాలంలో స్నానం చేయాలంటే నదీతీరానికి వెళ్లేవారు.ఇలా నదీ స్నానం చేయటం వల్ల ఎంతో పుణ్యఫలం కలుగుతుందని భావిస్తారు.

అందుకే ఇప్పటికీ కూడా ప్రతి ఆలయం నది తీర ప్రాంతంలో ఉండటంవల్ల ఈ ఆలయాన్ని సందర్శించిన భక్తులు నదీస్నానం ఆచరించి అనంతరం స్వామివారి దర్శనానికి వెళ్తారు.అయితే మన దేశంలో ఎన్నో పుణ్య నదులు ఉన్నాయి.

ఏ నదిలో స్నానం చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.ఎంతో పవిత్రమైన గంగా నదిలో స్నానం చేయటం వల్ల పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.

అదేవిధంగా గోదావరి నదిలో స్నానం చేయడం వల్ల 100 సంధ్యా వందనాలు చేసిన పుణ్యఫలం మనకు దక్కుతుంది.శ్రీ మహావిష్ణువు అనుగ్రహం మనపై ఉండాలంటే కృష్ణా నది తీరాన స్నానమాచరించాలని పండితులు చెబుతారు.

Bathing In Any River Is A Virtue Details, Bathing, River, Ganga River, Gauthami

పవిత్రమైన తుంగభద్ర నదిలో స్నానమాచరించడం వల్ల సత్య లోక ప్రాప్తి కలుగుతుంది.

Bathing In Any River Is A Virtue Details, Bathing, River, Ganga River, Gauthami

ఈ క్రమంలోనే గౌతమీ నదిలో స్నానమాచరించడం వల్ల సకల పాపాలు తొలగిపోయి పుణ్యం కలుగుతుంది.నర్మదా నదిలో స్నానమాచరించి మనం ఎవరికైనా దానం ఇవ్వాలి అనుకున్న వస్తువులను దానం ఇవ్వడం వల్ల విష్ణు లోక ప్రాప్తి కలుగుతుంది.ఇలా మన దేశంలో ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి నదులకు పుష్కరాలు జరుగుతాయి పుష్కర సమయంలో నదీ స్నానం చేయటం వల్ల అత్యంత పుణ్యఫలం దక్కుతుందని గత జన్మలో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

తాజా వార్తలు