పని ఒత్తిడిని తట్టుకోలేక దారుణానికి తెగబడిన బ్యాంకు మేనేజర్.. ?

మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు మనసు అదుపుతప్పుతుంది.అప్పుడు వచ్చే ఆలోచనలు జీవితాన్నే మార్చేస్తాయని ఎన్నో సందర్భాల్లో నిరూపించబడింది.

ప్రస్తుతం ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.ఆ వివరాలు చూస్తే.

Bank Manager Commits Suicide Due To Work Stress Kerala, Bank Manager, Commits S

కేరళలోని కన్నూరు జిల్లా కుతుపరంబాలో నివాసం ఉంటున్న ఓ మహిళ ఉద్యోగి (38) ‌గతేడాది సెప్టెంబర్‌లో ప్రమోషన్‌పై త్రిస్సుర్‌ నుంచి కొతుపరంబాలోని తొక్కిలంగడి బ్రాంచ్‌కు మేనేజర్‌గా వచ్చింది.కాగా ఇక్కడ ఎదురైయ్యే పని ఒత్తిడిని తట్టుకోలేక శనివారం తాను పని చేస్తున్న బ్యాంకులోనే బలవన్మరణానికి పాల్పడిందట.

ఇక ఈ విషయాన్ని తోటి ఉద్యోగి గమనించి సహోద్యోగుల సహాయంతో ఆస్పటల్‌కు తరలించారు.కానీ అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు నిర్ధారించారట.

Advertisement

ఇక ప్రమాద ఘటన సమాచారం అందుకున్న పోలీసులు బ్యాంకులో ఆమె మరణించిన గదిని పరిశీలించగా, అక్కడ ఒక డైరీ కనిపించడంతో దాన్ని స్వాధీనం చేసుకున్నారట.అయితే ఈ డైరీలో తాను పని ఒత్తిడిని తట్టుకోలేక పోతున్నానని, అందువల్లనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నది.

మొటిమలపై నిమ్మరసాన్ని ఈ 5 పద్ధతుల్లో ఉపయోగించాలి
Advertisement

తాజా వార్తలు