తండ్రి గాజుల కార్మికుడు.. కొడుకు సీఏ.. ఈ వ్యక్తి సక్సెస్ స్టోరీకి హ్యాట్సాఫ్ అనాల్సిందే!

కేంద్రంలో, తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు మారుతున్నా పేదల జీవితంలో మాత్రం పెద్దగా మార్పు రావడం లేదు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు తాత్కాలికంగా లాభం చేకూరుస్తున్నా దీర్ఘకాలంలో మంచి లాభాలను మాత్రం అందించడం లేదు.

అయితే గాజులు తయారు చేసే కార్మికుడి( Bangle Worker ) కొడుకు సీఏగా సక్సెస్ సాధించి ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.ఇతర కోర్సులతో పోల్చి చూస్తే సీఏ( Chartered Accountant ) పాస్ కావడం సులువు కాదనే సంగతి తెలిసిందే.

సీఏ కోర్సును మధ్యలో ఆపేసి ఇతర కోర్సులపై దృష్టి పెట్టిన వాళ్లు దేశంలో లక్షల సంఖ్యలో ఉన్నారు.అయితే యూపీకి చెందిన శివమ్ అగర్వాల్( Shivam Agarwal ) మాత్రం సీఏ ఫైనల్ ఫలితాలలో పాసై ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు.

ఘెర్ అస్గ్రాన్‌ అనే ప్రాంతంలో జన్మించిన శివమ్ అగర్వాల్ బాల్యం నుంచి కష్టపడి చదివారు.

Bangle Worker Son Shivam Agarwal Chartered Accountant Inspirational Success Stor
Advertisement
Bangle Worker Son Shivam Agarwal Chartered Accountant Inspirational Success Stor

తండ్రి సంజీవ్ కుమార్( Sanjeev Kumar ) గాజుల తయారీ గిడ్డంగులలో కూలీగా పని చేసేవారు.సీఏ( CA ) చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలుసుకున్న సంజీవ్ కుమార్ తన కొడుకును సీఏ చేయాలని భావించి కష్టపడి చదివించారు.2016 సంవత్సరంలో సీఏ కోర్సులో చేరిన శివమ్ అగర్వాల్ సీపీటీ, ఐపీసీసీ, సీఏ ఫైనల్ కోర్సులలో ఉత్తీర్ణత సాధించి ప్రశంసలు అందుకున్నారు.ప్రస్తుతం శివమ్ అగర్వాల్ కుటుంబం అద్దె ఇంట్లో జీవనం సాగిస్తోంది.

Bangle Worker Son Shivam Agarwal Chartered Accountant Inspirational Success Stor

శివమ్ అగర్వాల్ సీఏ కావడంతో రాబోయే రోజుల్లో ఆర్థిక కష్టాలు తీరతాయని ఈ కుటుంబం భావిస్తోంది.ఈ జనరేషన్ లో ఎంతోమంది శివమ్ అగర్వాల్ ను స్పూర్తిగా తీసుకొని తాము కూడా కెరీర్ పరంగా సక్సెస్ సాధిస్తామని చెబుతున్నారు.శివమ్ అగర్వాల్ తండ్రి సంజీవ్ కుమార్ కృషిని సైతం నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు.

శివమ్ అగర్వాల్ టాలెంట్ గురించి తెలిసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల.. పైచేయి సాధించిన అమ్మాయిలు..!
Advertisement

తాజా వార్తలు