పవన్ కళ్యాణ్ కు మీ వల్లే ఈ డామేజ్ జరిగింది... బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు!

సినీ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ కేవలం రాజకీయాలలో ఎంతో బిజీగా మారిపోయారు.

ఎన్నికలకు ముందు ఈయన కమిట్ అయిన పలు సినిమాలో షూటింగ్స్ వీలైనప్పుడు చేస్తూ ఆ సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు.

ఇక సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాజకీయాలలో కూడా గొప్ప నాయకుడిగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ కు ఎంతో మంది వీరాభిమానులు ఉన్నారు.ఇలాంటి వారిలో బండ్ల గణేష్ ( Bandla Ganesh ) ఒకరని చెప్పాలి.

నిజానికి ఈయన పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని కాదు ఒక భక్తుడు అనే చెప్పాలి.

Bandla Ganesh React On Producer Ramesh Comments About Pawan Kalyan Movie Details

బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ను దేవుడితో సమానంగా పూజిస్తూ ఉంటారు ఎన్నో సందర్భాలలో పవన్ కళ్యాణ్ పై తనకున్నటువంటి భక్తిని కూడా చాటుకున్నారు అయితే తాజాగా పవన్ కళ్యాణ్ గురించి బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇటీవల నిర్మాత సింగనమల రమేష్ ( Producer Singanamala Ramesh ) ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ తాను పులి,( Puli ) ఖలేజా( Khaleja ) వంటి సినిమాల ద్వారా 100 కోట్ల రూపాయల నష్టాలను ఎదుర్కొన్నానని పైగా ఏడాదిలో పూర్తయ్యే సినిమాలను మూడు సంవత్సరాల పాటు చేశారు అంటూ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ గురించి కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.

Bandla Ganesh React On Producer Ramesh Comments About Pawan Kalyan Movie Details
Advertisement
Bandla Ganesh React On Producer Ramesh Comments About Pawan Kalyan Movie Details

ఇలా ప్రొడ్యూసర్ రమేష్ చేసినటువంటి ఈ కామెంట్లపై బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ.రమేష్ గారు మీరు సరిగ్గా  ప్లాన్ చేసుకోలేకపోవడం మీ తప్పు .మీకోసం పవన్ కళ్యాణ్ గారు మూడు సంవత్సరాల పాటు ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వకుండా కొన్ని వందల కాల్ షీట్స్ వృధా చేసుకున్నారు.మీ వల్ల పవన్ కళ్యాణ్ గారికి పెద్ద డ్యామేజ్ జరిగింది అందుకు నేనే ప్రత్యక్ష సాక్షి.

దయచేసి ఈ విషయాన్ని రాద్ధాంతం చేసుకోకండి ఇది కరెక్ట్ కాదంటూ ఈయన చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు