YCP : ప్రకాశం జిల్లా వైసీపీలో ముదిరిన వర్గ విభేదాలు

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రకాశం జిల్లా వైసీపీలో వర్గ విభేదాలు( YCP Politics ) మరింత ముదురుతున్నాయి.

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వర్గీయుల మధ్య ఫ్లెక్సీ వార్ మొదలైంది.

ఎమ్మెల్యే చెవిరెడ్డి( MLA Chevireddy )ని ప్రకాశం మరియు నెల్లూరు జిల్లా ఇంఛార్జ్ గా వైసీపీ అధిష్టానం ప్రకటించిన సంగతి తెలిసిందే.చెవిరెడ్డి నియామకాన్ని బాలినేని అనుచర వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలుస్తోంది.

చెవిరెడ్డిని ఇంఛార్జ్( Nellore Incharge ) గా ప్రకటించడంతో మరోసారి అసంతృప్తికి గురైన బాలినేని హైదరాబాద్ కు వెళ్లిపోయారని సమాచారం.ఈ క్రమంలోనే ఒంగోలు జిల్లా పార్టీ కార్యాలయం వద్ద పోటాపోటీగా ఫ్లెక్సీలు వెలిశాయి.మంత్రి మేరుగ నాగార్జున కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బాలినేని ఫ్లెక్సీలను( Balineni Flexis ) తొలగించారు.

దీనికి ప్రతిగా ఏర్పాటు చేసిన చెవిరెడ్డి ఫ్లెక్సీలను బాలినేని వర్గీయులు తొలగించారు.దీంతో జిల్లా వైసీపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement
How Modern Technology Shapes The IGaming Experience

తాజా వార్తలు