వివేకా హత్య కేసు దర్యాప్తులో సీబీఐ తన పని తాను చేసుకుంటూ పోతుంది మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ..

తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన హత్యతో ఎవరికి సంబందం ఉంటుందో అర్దం చేసుకోవాలన్నారు.అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏం చేస్తున్నారు అనిమంత్రి బాలినేని ప్రశ్నించారు.

హత్య జరిగినప్పుడే సీబీఐ ఎంక్వైరీ వేసి ఉండాల్సిందన్నారు.హత్యతో టీడీపీ వారికి సంబందం ఉంటుందని భయపడే చంద్రబాబు సీబీఐతో దర్యాప్తు చేయించలేదన్నారు.

డీజీపీపై వ్యతిరేకత ఉంటే ఏపీపీఎస్సీ చైర్మన్ గా అవకాశం ఇచ్చి ఉండే వారమా అన్నారు.నిన్నటి వరకూ డీజీపీని తిట్టిన నోటితోనే ఇప్పుడు ఆయన బదిలీ చేశారని రాగ్దాంతం చేయటం ఆయనకే సరిపోయిందన్నారు.

ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వెళ్లేందుకు సిద్దంగా ఉన్నారన్నారు.రాష్ట్రాన్ని అప్పుల చేసి అధోగతి పాలు  చేసిన చంద్రబాబు అప్పుల గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు.

Advertisement

దేశంలో అప్పులు లేని రాష్ట్రం ఉందా అని ప్రశ్నించారు.విద్యుత్ శాఖలో ఆయన చేసిన వేల కోట్ల రూపాయల అప్పులు మేము తీరుస్తున్నామన్నారు.

కరోనాతో ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పధకాలను సీఎం జగన్ చక్కగా అమలు చేస్తున్నారని మంత్రి బాలినేని కితాబునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు