మోక్షజ్ఞ చేయాల్సిన ఆ సూపర్ హిట్ సినిమాను రిజెక్ట్ చేసిన బాలయ్య... కారణం ఏంటంటే..?

నందమూరి ఫ్యామిలీ నుంచి మూడోవ తరం హీరోగా మోక్షజ్ఞను( Mokshagna ) ఇండస్ట్రీ కి పరిచయం చేయాలనే ఉద్దేశ్యంలో బాలయ్య బాబు( Balayya Babu ) చాలా ఆసక్తి చూపిస్తున్నాడు.

అయినప్పటికీ ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఎప్పటికప్పుడు లేట్ అవుతూ వస్తున్నాయి.

ఇక ఇప్పుడు మరోసారి మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందంటూ పలు రకాల కథనాలు వెలువడుతున్నప్పటికీ ఆయనను పరిచయం చేసే దర్శకుడు ఎవరు అనే దానిపైననే పలు రకాల కథనాలైతే వెలువడుతున్నాయి.

ఇక ఇదిలా ఉంటే మరికొందరు మాత్రం ప్రశాంత్ వర్మ( Prasanth Varma ) చేసిన హనుమాన్ ( Hanuman ) సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తే ఆ సినిమా కమర్షియల్ గా సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా నటుడుగా కూడా మోక్షజ్ఞ కి మంచి గుర్తింపు వచ్చేదని మొదటి సినిమాకి ఒక మంచి కథతో ఆయన అరంగేట్రం చేసేవాడు అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమా కథని ముందుగా బాలయ్య కు చెప్పినప్పటికీ బాలయ్య బాబు ఎందుకో దాన్ని మోక్షజ్ఞ మొదటి సినిమాగా చేస్తే అంత ఇంపాక్ట్ ఉండదనే ఉద్దేశంతోనే రిజెక్ట్ చేశారట.అందువల్లే ప్రశాంత్ వర్మ ఆ సినిమాని తేజ సజ్జాతో( Teja Sajja ) చేసి భారీ సక్సెస్ ని అందుకున్నాడు.

ఇక 50 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 400 కోట్ల కలెక్షన్లు రాబట్టడం అంటే మామూలు విషయం కాదు.ఇక చేజేతులారా వచ్చిన ఛాన్స్ ను మిస్ చేసుకున్న బాలయ్య ఇప్పుడు మళ్ళీ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లోనే మోక్షజ్ఞతో సినిమా చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక మరి కొంతమంది క్రిష్ డైరెక్షన్ లో మోక్షజ్ఞ సినిమా ఉంటుంది.

Advertisement

బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఉంటుందంటూ వార్తలైతే స్ప్రెడ్ చేస్తున్నప్పటికీ అఫీషియల్ గా బాలయ్య మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు.

వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం .. భారతీయులకు మేలు !
Advertisement

తాజా వార్తలు