సెట్స్ లో కళ్యాణ్ ని బెదిరించిన బాలకృష్ణ?

బాలయ్య బాబు చాలా ముక్కుసూటి మనిషి.ప్రేమైనా, కోపమైనా, ఏదైనా స్పష్టంగా, అతివృష్టి లాగా చూపించడమే ఆయనకు అలవాటు.

అభిమానం హద్దులో ఉంటె దగ్గరకి తీస్తారు, అతిగా ఉంటె ఒకట్టి అంటిస్తారు.ఆయనంతే.

Balarishna Warned Producer On The Sets?-Balarishna Warned Producer On The Sets--

దాచుకోవడం, పైకోదో మాట్లాడటం ఉండదు అంటారు సన్నిహితులు.అందరు ఇలానే ఆలోచించరు కదా.నాణేనికి ఎప్పుడు రెండువైపులు ఉంటాయి.కొందరికి అవి వింత పోకడలుగా కనిపిస్తాయి.

ఎలా అనుకున్నా సరే, బాలయ్యబాబుకి కొంచెం కోపం ఎక్కువే అని ఒప్పుకోక తప్పదు.ఆ కోపం వలనే మీడియాకి న్యూస్ గా మారిపోతుంటారు.

Advertisement

అభిమానులకి చెంపదెబ్బల వేడి ఇంకా తగ్గక్కముందే, బాలకృష్ణ గురించి ఓ కొత్త వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది.ఎంతవరకు నిజమో తెలియదు కాని, బాలయ్య నిర్మాత సి.కళ్యాన్ తో గొడవ పడ్డారట.బాలకృష్ణ 102 వ సినిమాకి ఆయనే నిర్మాత.

ఈ సినిమా బడ్జెట్ విషయంలో ఏవో మనస్పర్థలు మొదలయ్యాయట.చిన్న చర్చ లాగా మొదలైనా, మాట మాట పెరిగిందని, ఈ క్రమంలో బాలకృష్ణ సి.కళ్యాణ్ ని బెదిరించారని గాలిలో కబుర్లు వస్తున్నాయి.మరి ఇది గాలి కబురేనో, నిజమైతే ఆ వార్నింగ్ లో కంటెంట్ ఏమిటో తెలియదు.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే, తమిళ టాప్ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ దీనికి దర్శకుడు.ఆయనా చాలాకాలం తరువాత ఓ తెలుగు సినిమా చేస్తున్నారు.

నయనతార కథానాయిక.ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

సూపర్ స్టార్ కృష్ణ కామెంట్ చేయగానే.. అల్లు రామలింగయ్య దండం పెట్టారట తెలుసా?
Advertisement

తాజా వార్తలు