వీర సింహారెడ్డి కాకుండా ఆ కథ చేసి ఉంటే బాగుండేది!

సంక్రాంతి సందర్భంగా నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహా రెడ్డి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.గోపీచంద్ మలినేని దర్శకత్వం లో రూపొందిన ఆ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

100 కోట్ల కలెక్షన్స్ దిశగా దూసుకు వెళ్తుంది.దర్శకుడు గోపీచంద్ మలినేని గత చిత్రం క్రాక్ విడుదలైన వెంటనే బాలకృష్ణ తో సినిమా కు కమిట్ అయ్యాడు.

మొదట బాలకృష్ణ కోసం ఒక రియల్ ఇన్సిడెంట్ తో కూడిన కథ ని తీసుకుని సినిమా చేయాలని భావించాడు.అందుకోసం పల్నాటి లో జరిగిన కొన్ని సంఘటనలను మరియు అప్పటి నేరాలను సంబంధించి అధ్యాయం చేయడం జరిగింది.

ఆ సందర్భం లో గోపీచంద్ మలినేని పాత పేపర్లు తిరిగేసిన ఫోటోలు మరియు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Advertisement

బాలకృష్ణ ను ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా గోపీచంద్ మలినేని చూపించబోతున్నట్లుగా ఆ సమయం లో ప్రచారం జరిగింది.కానీ ఆ కథ రెడీ అయిన తర్వాత బాలకృష్ణ కు నచ్చలేదట.దాంతో తన వద్ద గతం లో ఉన్న ఒక కథ ను గోపీచంద్ వినిపించిన వెంటనే బాలకృష్ణ ఓకే చెప్పాడని.

అదే వీర సింహా రెడ్డి కథ అని సమాచారం అందుతుంది.వీర సింహా రెడ్డి సినిమా కాకుండా క్రాక్ మాదిరిగా రియల్ సంఘటనల తో కూడిన కథ ను బాలకృష్ణ చేసి ఉంటే కచ్చితంగా వీర సింహా రెడ్డి కి మించి డబల్ సక్సెస్ ని ఆ సినిమా దక్కించుకునేది అంటూ విశ్లేషకులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి బాలకృష్ణ తీసుకున్న నిర్ణయాన్ని కొందరు తప్పు పడుతూ ఉంటే మరి కొందరు మాత్రం ఆయన జడ్జిమెంట్ విషయం లో తప్పు పట్టాల్సిందే లేదని, గోపీచంద్ మొదట చెప్పిన కథ వర్కౌట్ అవ్వక పోయేదేమో అంటూ కొందరు అభిప్రాయం చేస్తున్నారు.మొత్తానికి గోపీచంద్ మలినేని ఆ కథను అలాగే ఉంచుకున్నాడు.

మరి ఎవరితో ఆ కథను చేస్తాడు అనేది చూడాలి.

కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?
Advertisement

తాజా వార్తలు