మామయ్య ఎక్కడికి వెళ్లిన మందు బాటిల్ ఉండాల్సిందే: శ్రీ భరత్

నందమూరి నట సింహం బాలకృష్ణ (Balakrishna) ఇటీవల వివాదంలో చిక్కుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఈయన యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak sen) నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs Of Godavari) అనే సినిమా ప్రీ రిలీజ్ వేడుకలలో భాగంగా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఈయన నటి అంజలి (Anjali) పట్ల వ్యవహరించినటువంటి తీరు సంచలనంగా మారింది.వేదికపై అందరూ ఉండగానే హీరోయిన్ అంజలిని ఈయన తోయటంతో వివాదంగా మారింది.

బాలయ్య ఫుల్లుగా మద్యం తాగి వచ్చారని అందుకే అలా దురుసుగా ప్రవర్తించారంటూ విమర్శలు కురిపించారు.

ఇలా బాలకృష్ణ గురించి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న తరుణంలో నిర్మాత నాగ వంశీ(Naga Vamsi) స్పందించారు.బాలయ్య అసలు మద్యం తాగలేదని ఆయన పక్కన మద్యం బాటిల్ ఉన్నటువంటి వీడియోని చిత్రీకరించి ఆయనపై విమర్శలు చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు.ఇలా బాలయ్య ఈ వివాదంలో విమర్శలను ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో గత కొద్ది రోజుల క్రితం తన చిన్నల్లుడు శ్రీ భరత్ (Sree Bharath) బాలయ్య మందు అలవాట్ల గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Advertisement

ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి భరత్ తన మామయ్య మ్యాన్షన్ హౌస్ తాగుతాడని తెలిశాక ఆ కంపెనీ స్టాక్స్ విలువ పెరిగింది అన్నారు.ఆయన హాట్ వాటర్ లో కలుపుకుని తాగుతాడట కదా? అని యాంకర్ అడగగా అవునని భరత్ చెప్పారు.మామయ్య దగ్గర ఒక బ్యాగ్ ఉంటుందని అందులో మందు బాటిల్ తో పాటు హాట్ వాటర్ బాటిల్ కూడా ఉంటుందని ఎక్కడికి వెళ్లినా ఆయన మాత్రం ఆ బ్యాగ్ వదలరని తెలిపారు.

ఇలా బాలకృష్ణ మద్యం అలవాట్ల గురించి గతంలో ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.మరి ఈ సినిమా వేడుకకు బాలకృష్ణ (Balakrishna)నిజంగానే మద్యం తాగి వచ్చారా లేదా అనేది తెలియదు కానీ ఈ విషయంలో మాత్రం ఈయన భారీ స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు