Balakrishna: లైవ్ లో పాట పాడిన బాలకృష్ణ.. వీడియో చూస్తే వావ్ అనకుండా ఉండలేరు!

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు నందమూరి నటసింహం హీరో బాలకృష్ణ( Balakrishna ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

కాగా బాలయ్య బాబు ఈ వయసులో కూడా అదే ఊపుతో వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు.

కాగా ఈ ఏడాది ఆరంభంలో వీర సింహారెడ్డి సినిమాతో( Veerasimha Reddy ) ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ప్రస్తుతం తదుపరి సినిమా షూటింగ్లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.

ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో యాక్టివ్గా పాల్గొంటున్నారు.అలాగే ఈ మధ్య కాలంలో ఓటీటీ లో కూడా దూసుకుపోతున్నారు బాలయ్య బాబు.

ఇప్పటికే ఆహాలో ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షోకు( Unstoppable With NBK ) హోస్ట్ గా వ్యవహరించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న విషయం తెలిసిందే.

Advertisement

ఇది ఇలా ఉంటే బాలయ్య బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో బాలయ్య బాబు సరసన కాజల్ హీరోయిన్గా నటిస్తుండగా శ్రీ లీల బాలయ్య బాబు కూతురుగా నటిస్తోంది.ఇది ఇలా ఉంటే తాజాగా నందమూరి బాలకృష్ణ తనలో ఉన్న మరో టాలెంట్ ని ప్రేక్షకులకు పరిచయం చేశారు.

తనలో ఉన్న గాయకుడిని మరోసారి ప్రేక్షకులకు పరిచయం చేశారు బాలకృష్ణ. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన లైవ్‌లో పాట పాడి అలరించారు.స్వర్గీయ నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఖతార్‌లోని దోహాలో శుక్రవారం ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.అభిమానుల కోరిక మేరకు ఎన్టీఆర్‌ నటించిన జగదేకవీరుని కథ సినిమా నుంచి శివశంకర పాటను పాడారు.ఆయన పాటకు ప్రేక్షకులు ఫిదా అయి చప్పట్లతో తమ అభిమానాన్ని చాటారు.

ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.కాగా బాలయ్య బాబు పాటకు సభా ప్రాంగణమంతా కూడా చప్పట్లతో మారు మోగిపోయింది.

Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo

బాలయ్య బాబుతో పాటు పక్కనే ఉన్న సింగర్ లు సైతం బాలయ్య బాబు పాటను విని ఆశ్చర్యపోయారు.వారు కూడా చెప్పట్లతో బాలయ్య బాబుని అభినందించారు.

Advertisement

తాజా వార్తలు