'క‌థానాయ‌కుడు’ కి భారీ న‌ష్టాలు...అంచనాలు తారుమారవ్వడంతో బాలయ్య సంచలన నిర్ణయం.!

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన అన్న గారి జీవిత చరిత్ర "కథానాయకుడు" సినిమా ఇటీవలే విడుదలయ్యి ప్రశంసలు అందుకున్న సంగతి అందరికి తెలిసిందే.

సినిమా చూసిన వారందరు బాలయ్య గారు అన్న గారి లాగే ఉన్నారు అన్నారు.

తెలుగు సినిమా రంగంలో గొప్ప హీరో అంటే ఇప్పటికి అన్న గారి పేరే చెబుతారు.అలాంటి అన్న గారు సినిమా రంగంలో ఎన్ని కష్టాలు పడ్డారు ఈ సినిమాలో చక్కగా చూపించారు.

కానీ ఈ సినిమా అనుకున్న రేంజ్ లో విజయం సంపాదించలేదు.కలెక్షన్స్ పరంగా చూస్తే గోరపరాజయం రుచి చూసింది కథానాయకుడు.క‌థానాయ‌కుడు ప్ర‌భావం ఇప్పుడు ‘మ‌హానాయ‌కుడు’పై కూడా పడనుంది.

సినిమా కొనడానికి బయర్స్ కంగారుపడుతున్నారు.

Advertisement

ఈ నేపథ్యంలో ఈ సినిమా నిర్మాత బాలకృష్ణ సంచలన నిర్ణయం తీసుకున్నారు.‘మ‌హానాయ‌కుడు’ సినిమాను బ‌య్య‌ర్ల‌కు ఫ్రీగా ఇచ్చేస్తున్నార‌నే వార్త‌లు ఇప్పుడు వినిపిస్తున్నాయి.అయితే విడుద‌లైన త‌ర్వాత లాభాల్లో వాటా తీసుకోవాల‌నేది నిర్మాత‌ల‌కు, బ‌య్య‌ర్ల‌కు మ‌ధ్య ఒప్పందంలా క‌నిపిస్తుంది.

దీనికి క్రిష్ కూడా ఒప్పుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది.ఫిబ్ర‌వ‌రి 7న విడుద‌ల కానుంది ‘మ‌హానాయ‌కుడు’.

Advertisement

తాజా వార్తలు