Balakrishna : బాలయ్య ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? అలాంటి విమర్శలు ఏంటి బాబోయ్?

టీడీపీ నారా లోకేష్( Nara Lokesh ) గత కొద్ది రోజులుగా యువగలం పాదయాత్ర పేరుతో ఏపీలోని పలు జిల్లాలలో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే లోకేష్ యువగలం పాదయాత్ర 63వ రోజుకు చేరుకుంది.

ప్రస్తుతం నారా లోకేష్ అనంతపురం జిల్లాలో పాదయాత్రను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.ఇక సింగనమల నియోజకవర్గం లో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ తో పాటు పిల్లనిచ్చిన మామ హీరో బాలకృష్ణ( Balakrishna ) వెళ్లారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ, లోకేష్ ఇద్దరు కలిసి పాదయాత్రలో భాగంగా కలిసి నడిచారు.

Balakrishna Same As Nara Lokesh

ఈ నేపథ్యంలోనే జనాలతో మాట్లాడుతూ బాలయ్య బాబు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా ప్రవర్తించారు.ఈ సందర్భంగా బాలయ్య బాబు మాట్లాడుతూ.జ‌గ‌న్ ( Jagan )ప్ర‌భుత్వం పై విమ‌ర్శ‌లు గుప్పించచారు.

Advertisement
Balakrishna Same As Nara Lokesh-Balakrishna : బాలయ్య ఏం మా�

అంతే కాకుండా ఆవేశంలో జ‌గ‌న్‌కు ఓటు వేయ‌ద్ద‌ని కూడా కోరారు బాలయ్య బాబు.సంక్షేమ ప‌థ‌కాల వ‌ల్ల ఏ ఒక్క‌రికీ ప్ర‌యోజ‌నం లేద‌ని, మీరూ, నేనూ ఇలా ఎవ‌రూ బాగుప‌డ‌లేద‌న్నారు.

కానీ ప్ర‌తి ఒక్క‌రూ అప్పుల‌పాలు అయ్యారు అని తెలిపారు బాలకృష్ణ.అలాగే న‌వ‌ర‌త్నాల సంక్షేమ ప‌థ‌కాలు అందుతున్నాయ‌నే భావ‌న‌తో వైసీపీకి( YCP ) ఓటు వేయ‌వ‌ద్ద‌ని చెప్ప‌డం ఆయ‌న‌కే చెల్లింది.

Balakrishna Same As Nara Lokesh

సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుతో ఆంధ్ర‌ప్ర‌దేశ్( Andhra Pradesh ) రాష్ట్రం శ్రీ‌లంక‌లా త‌యార‌వుతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు బాలయ్య బాబు.ప్రస్తుతం శ్రీ‌లంక‌లో ఆర్థిక సంక్షోభం నెల‌కొన్న విషయం తెలిసిందే.ఏపీలో కూడా సంక్షేమ ప‌థ‌కాల వ‌ల్ల రాష్ట్రం దివాళా తీస్తుందది అని తెలిపారు బాలయ్య బాబు.

ఓటు అనే ఆయుధాన్ని స‌క్ర‌మంగా వాడుకోవాల‌ని కోరారు.కుల‌మ‌నో, మ‌రొక కార‌ణ‌మో చూపి వైసీపీకి అండ‌గా నిల‌బ‌డ‌కూడ‌దని తెలిపారు.

రోజూ రాత్రి ఇలా చేస్తే కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయ‌ట‌..తెలుసా?

అలాగే జ‌గ‌న్‌ పై సొంత పార్టీ నేత‌ల్లోనే తీవ్ర అసంతృప్తి వుంద‌ని చాలా మంది వైసీపీ నేత‌లు టీడీపీ లోకి సేవ చేసేందుకు వ‌స్తామ‌ని వారే అడుగుతున్నార‌ని బాలయ్య బాబు తెలిపారు.చాలామంది బాలయ్య బాబు మాట్లాడిన మాటలపై సెటైర్లు వేస్తున్నారు.

Advertisement

అసలు బాలయ్య బాబు ఏం మాట్లాడుతున్నారో అర్థం అవుతుందా.సరిపోయింది అల్లుడికి తగ్గ మామ అంటూ సెటైర్లు వేస్తున్నారు.

తాజా వార్తలు