నందమూరి బాలకృష్ణ తనయుడు హీరోగా రాబోతున్నాడు అంటూ గత మూడు నాలుగు సంవత్సరాలుగా మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి.
మోక్షజ్ఞ ఎంట్రీ విషయం ఏమో కాని ఇప్పుడు బాలయ్య చిన్న కూతురు తేజస్వి ఎంట్రీ గురించిన వార్తలు జనాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.
తాజాగా తేజస్వి భర్త భరత్ టీవీ9కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.తేజస్వికి సినిమాలంటే ఆసక్తి ఉన్నా కూడా ఆమెను ఆ దిశగా ఎవరు ప్రోత్సహించలేదు.
అందుకే ఆమె అటు వెళ్లలేదు అన్నాడు.
భర్తగా నేను ఆమెకు ఎలాంటి అడ్డు చెప్పడం లేదు.ఆమె అభిరుచికి తగ్గట్లుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నట్లుగా భరత్ చెప్పుకొచ్చాడు.అయితే ప్రస్తుతం ఆమె అభిరుచి నటనపై లేదని ఆమెకు ప్రొడక్షన్ అంటే ఇష్టం కనుక ఆమె త్వరలోనే నిర్మాతగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని స్వయంగా భరత్ చెపకొచ్చాడు.
భవిష్యత్తులో ఆమె నిర్మాతగా మారితే బాలకృష్ణ హీరోగా ఆమె నిర్మాణంలో సినిమా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని భరత్ పేర్కొన్నాడు.
గతంలో తెలుగు సినిమా పరిశ్రమలో అమ్మాయిల ఎంట్రీ విషయంలో కొన్ని అపోహలు ఉన్నాయి.అందుకే తేజస్విని ఎవరు కూడా ఆ దిశగా ప్రోత్సహించలేదని నేను అనుకుంటున్నారు.తేజస్వి మరియు బ్రహ్మణి ఇద్దరు కూడా అందంగా ఉంటారు.
తేజస్వి నటన పరంగా కూడా బాగా చేస్తుంది.డాన్స్‌లు కూడా బాగానే చేస్తుంది.
ఒకవేళ తేజస్వి హీరోయిన్ అయితే తప్పకుండా మంచి నటి అయ్యేదని భరత్ అన్నాడు.నటి ఎలాగూ కాలేక పోయింది కనీసం నిర్మాతగా అయినా తేజస్వి రాణించి సక్సెస్ అవుతుందా చూడాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy