మూడు నెలల్లో రికార్డులకు ఎసరుపెట్టిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తన నెక్ట్స్ మూవీని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో అటు బాలయ్య, దర్శకుడు బోయపాటి ఖచ్చితంగా హిట్ కొట్టాలని చూస్తున్నారు.

అయితే కథ విషయంలో బోయపాటి ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తున్నాడు.ఇక ఈ సినిమా కథలో కొన్ని మార్పులు చేస్తున్నాడు బోయపాటి.

ఇప్పటికే సినిమాను అధికారికంగా ప్రారంభించినా, షూటింగ్ మాత్రం మొదలు కాలేదు.ఇది ఇలా ఉండగానే సినిమా రిలీజ్‌ విషయంలో చిత్ర యూనిట్ ఓ నిర్ణయానికి వచ్చారు.

ఈ సినిమాను జూలై 30న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యారు.బాలయ్య కోసం అదిరిపోయే కథను రెడీ చేస్తోన్న బోయపాటి చిత్ర షూటింగ్‌ను మూడు నెలల్లో కంప్లీట్ చేసి జూలైలో రిలీజ్ చేసేందుకు బాలయ్య-బోయపాటి ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

ఒక స్టార్ హీరో సినిమా కేవలం మూడు నెలల్లో షూటింగ్ కంప్లీ్ట్ చేసుకుని రిలీజ్‌ కావడం అంటే ఓ రికార్డే అని చెప్పాలి.గతంలోనూ బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాను కూడా కేవలం మూడు నెలల్లో పూర్తి చేసి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు.

మరి ఇలాంటి ఫీట్‌ను బాలయ్య మరోసారి ఎలా ఫినిష్ చేస్తాడో చూడాలి.

Advertisement

తాజా వార్తలు