గర్భిణికి సిజేరియన్ చేసిన నర్సు.. తర్వాత ఏం జరిగిందంటే..!

ప్రభుత్వ ఆసుపత్రులలో( Govt Hospitals ) అన్ని మౌలిక వసతులు, ఆధునిక యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి కానీ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం పేషంట్ల ప్రాణాలను తీస్తున్నాయి.

సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో డాక్టర్లు చేయాల్సిన పనులను నర్సులు( Nurse ) చేయడం వల్ల చాలామంది పేషెంట్లు ప్రాణాలను కోల్పోతున్నారు.

ఇలాంటి కోవలోనే డెలివరీ కోసం ఆస్పత్రికి వచ్చిన గర్భిణీకి సిజేరియన్( Caesarean ) చేసే డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో నర్సు సిజేరియన్ చేసి పండంటి బిడ్డను చంపేసిన ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

వివరాల్లోకెళితే.జనగామ జిల్లాలోని( Jangaon District ) పాలకుర్తి గవర్నమెంట్ ఆసుపత్రికి స్రవంత్రి( Sravanthi ) అనే గర్భిణి ప్రసవం కోసం వచ్చింది.

సిజేరియన్ చేసి కడుపులో బిడ్డను బయటకు తీయాల్సిన డాక్టర్ సమయానికి అందుబాటులో లేడు.దీంతో హాస్పిటల్ లో పనిచేస్తున్న స్టాఫ్ నర్స్ సిజేరియన్ చేసింది.

Advertisement

కడుపులోని బిడ్డను బయటకు తీసే క్రమంలో పొరపాటున బిడ్డ ప్రాణాలను తీసేసింది.దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

ఆస్పత్రి సూపరింటెండ్ బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బాధితురాలు కుటుంబ సభ్యులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

బాధితురాలి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.బుధవారం స్రవంతి పురిటి నొప్పులతో బాధపడుతుంటే ఆసుపత్రికి తీసుకువచ్చామని, నార్మల్ డెలివరీ అవుతుందని ఆసుపత్రి సిబ్బంది చెప్పారని తెలిపారు.అయితే బుధవారం రాత్రి పురిటి నొప్పులు అధికం అవడంతో సిజేరియన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

ఆ సమయంలో నైట్ డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్ ఆసుపత్రికి రాకపోవడంతో స్టాఫ్ నర్స్ సరితతో( Staff Nurse Saritha ) పాటు మరి కొంత మంది హాస్పిటల్ సిబ్బంది గర్భిణి స్రవంతికి సిజేరియన్ చేశారు.

పుష్పరాజ్ కూతురు కావేరిని తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అసలేం జరిగిందంటే?
వైరల్: బ్యాంకు క్యాషియర్ మెడపై కత్తి పెట్టి, డబ్బులు ఇవ్వాలని బెదిరించిన దొంగ!

కడుపులో నుండి బయటకు తీసిన పసిబిడ్డలో చలనం లేకపోవడంతో భయపడిపోయి వెంటనే జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు.అయితే అప్పటికే శిశువు చనిపోయిందని అక్కడి వైద్యులు నిర్ధారించారు.నర్స్ సిజేరియన్ చేయడం వల్లనే పసిబిడ్డ చనిపోయిందని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Advertisement

బాధిత మహిళ భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కారకులైన నర్సు తో పాటు వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఆస్పత్రి సూపరింటెండ్ లికిత పూర్వక హామీ ఇవ్వడంతో బాధితులు శాంతించి, ఆందోళన విరమించారు.

తాజా వార్తలు