తెలుగుదేశం త‌ర‌పున మాజీ వైకాపా నేత ?

ఆంధ్ర‌ప‌దేశ్‌ నుంచి తెలుగుదేశం పార్టీ త‌ర‌పున రాజ్యసభ అభ్యర్థులుగా కేంద్ర మంత్రి సుజనా చౌదరితో పాటు క‌ర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి టీజీ వెంకటేష్‌లను అభ్య‌ర్ధులుగా ప్ర‌క‌టించారు సీఎం చంద్రబాబునాయుడు .

విజయవాడలో సోమవారం రాత్రి విలేకరుల స‌మావేశంలో ఆయ‌న‌ మాట్లాడుతూ.

అనేక ప‌ర్యాయాలు పార్టీలోని అన్ని విభాగాల‌తో చర్చించాక‌నే సుజనా, టీజీలను ఎంపిక చేసిన‌ట్టు చెప్పారు.రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, భాజపా అధిష్టానం కోరిక మేర‌కు ఆ పార్టి అభ్య‌ర్ధికి మ‌ద్ద‌తిచ్చి మ‌న రాష్ట్రం నుంచి గెలిపించ‌బోతున్నామ‌ని, భాజపాకు సీటు కేటాయింపు విష‌య‌మై స్ప‌ష్ట‌త ఇచ్చారు.

అలాగే సుజనా చౌద‌రి రాజ‌కీయాలక‌న్నా రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్న కృషి వ‌ల్ల మరోసారి రాజ్యసభకు వెళ్తే మ‌న రాష్ట్రానికి మ‌రింత న్యాయం జరుగుతుంద‌ని భావిస్తున్న‌ట్టు చెప్పారు.అలాగే సామాజిక అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని టీజీ వెంకటేష్ ను ఎంపిక చేసిన‌ట్టు క‌నిపిస్తోంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌కు ఈ సీటు ఇవ్వ‌డం ద్వారా రాజ‌కీయంగానూ జ‌గ‌న్‌ని మ‌రింత దెబ్బ కొట్టాల‌ని చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు పార్టీ వ‌ర్గాల స‌మాచారం.మ‌రి నాలుగో అభ్య‌ర్ధిని నిల‌పితే ఈ ఎన్నిక అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కం అవుతుంద‌ని, తెలుగుదేశం భావిస్తోంది.

Advertisement

ఈ ్ర‌క‌మంలోనే తెలుగుదేశం నాలుగో అభ్య‌ర్ధిగా వైకాపాకు చెందిన ఓ శాస‌న స‌భ్యుడికి లేదా ఆ పార్టీ నుంచి వ‌చ్చిన ఓ యువ నేత‌కు ఛాన్స్ ఇచ్చే అవ‌కాశాలు ఎక్కువగా ఉన్న‌ట్టు స‌మాచారం.త‌ద్వారా ఆ నేత త‌న గ‌త ప‌రిచ‌యాల‌తో వైకాపా శాస‌న‌స‌భ్యులు చీల్చ‌డం ఖాయ‌మ‌ని, ఇది ఖ‌చ్చితంగా లాభిస్తుంద‌ని దేశం వ‌ర్గాలు భావిస్తున్నాయి.

, ఈ క్ర‌మంలోనే అంద‌రికీ ఆమోద‌యోగ్య‌మైన వ్య‌క్తి ఎంపిక విష‌య‌మై గోడ దూకి వ‌చ్చిన స‌భ్యుల‌తో బాబు చాలా సేపు చ‌ర్చ జ‌ర‌ప‌టం వెనుక ఆంత‌ర్య‌మిదే అన్న వాద‌న వివ‌స్తోంది.

Advertisement

తాజా వార్తలు