అయ్యప్ప దీక్షకు అన్ని నియమాలు ఎందుకు ఉన్నాయో తెలుసా?

అయ్యప్ప దీక్షలో చన్నీళ్ళ స్నానము,నెల మీద పడుకోవటం, ఒంటి పూట భోజనం,చెప్పులు లేకుండా నడవటం,బ్రహ్మచర్యం పాటించటం, మద్యమాంసాదులు, మసాలా దినుసులు వంటి తామసకారకాలైన వాటిని వదిలేటం వంటి నియమాలను ప్రతి ఒక్కరు పాటించవలసిందే.

అయ్యప్ప దీక్షను తీసుకునేవారు గురు స్వామి దగ్గర నుంచి తులసి,రుద్రాక్ష మాలను ధరించటం,నుదిటిన చందనం, విభూతి ధరిస్తారు.

ఈ విధంగా ఈ నియమాల వెనక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.

Ayyappa Swami Deeksha Rules

రెండు పూటల చన్నీటి స్నానము చేయటం వలన మనస్సు ప్రశాంతంగా ఉంది భగవంతుని ఆరాధనలో ఏకాగ్రత కుదురుతుంది.తులసి పూసల నుంచి వెలువడే గాలి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.రుద్రాక్ష రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులను అదుపులో ఉంచటానికి సహాయపడుతుంది.

ఇక చందనం, విభూతి ధరించటం వలన చక్కటి వర్ఛస్సు, ధైర్యం, బలం కలుగుతుంది.ఆహార నియమాలను పాటించటం వలన కోరికలు అదుపులో ఉంటాయి.

Advertisement
Ayyappa Swami Deeksha Rules-అయ్యప్ప దీక్షకు అన�

చెప్పులు లేకుండా నడిస్తే జీవితంలో భక్తులు కష్టాలను ఎదుర్కొనే శక్తి వస్తుంది.రంగురంగుల బట్టలపై మమకారం ఉండకూడదనటానికే నలుపు దుస్తులను ధరించాలని నియమం పెట్టారు.

నలుపు తమోగుణాన్ని సూచిస్తుంది.అంతేకాక నరదృష్టి దోషాన్ని హరిస్తుంది.

Advertisement

తాజా వార్తలు