ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభ తేదీ మార్పు ... కొత్త స్పీకర్ ఖరారు

ఈనెల 19 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు( AP Assembly ) ప్రారంభిస్తున్నట్లుగా ముందుగా ప్రకటించినా, ఆ తేదీని తాజాగా మార్చారు.

ఈనెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.

కొన్ని కారణాల వల్లే తేదీని మార్చినట్లు సమాచారం.శాసనసభ సమావేశాలు మొత్తం మూడు రోజుల పాటు జరుగునున్నాయి.

ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం మొదటి రోజు జరుగుతుంది.తరువాత స్పీకర్ ఎన్నికతో పాటు, డిప్యూటీ స్పీకర్ ను కూడా ఎన్నుకుంటారు.

ఈ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్( Jagan ) హాజరవుతారా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది.

Ayyanna Patrudu As Ap Assembly Speaker Details, Ap Spekar, Tdp, Telugudesam Part
Advertisement
Ayyanna Patrudu As AP Assembly Speaker Details, Ap Spekar, Tdp, Telugudesam Part

కేవలం 11 స్థానాలకు మాత్రమే వైసిపి( YCP ) పరిమితం కావడంతో, జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కారని, ప్రతిపక్ష హోదా కూడా లేనందున జగన్ అసెంబ్లీలో కాకుండా స్పీకర్ ఛాంబర్ లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరుగుతుంది.ఇది ఇలా ఉంటే ఏపీ శాసనసభ స్పీకర్ గా టిడిపి సీనియర్ నేత నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు( Chintakayala Ayyannapatrudu ) పేరు ఖరారు చేసినట్లు సమాచారం.డిప్యూటీ స్పీకర్ పదవిని పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

మొదటి రోజు సమావేశాలకు ప్రొటెం స్పీకర్ గా టిడిపి సీనియర్ నేత ,రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి( Gorantla Butchaiah Chowdary ) అవకాశం ఇస్తారు.

Ayyanna Patrudu As Ap Assembly Speaker Details, Ap Spekar, Tdp, Telugudesam Part

ఈనెల 22వ తేదీన మంత్రివర్గ సమావేశం జరుగుతుంది.ఆ సమావేశంలో అసైన్మెంట్ ల్యాండ్ చట్టం రద్దుకు ఆమోదంతో పాటు, మరికొన్ని కీలక బిల్లులను ఆమోదించబోతున్నట్లు సమాచారం.రఘురామకృష్ణంరాజు మొదటి నుంచి స్పీకర్ పదవి తనదేనని అనేక సందర్భాల్లో ప్రకటించారు.

అయితే రఘురామ కృష్ణంరాజుకు( Raghurama Krishnam Raju ) మంత్రి పదవి కేటాయించలేదు స్పీకర్ గాను అవకాశం ఇవ్వడం లేదు.దీంతో ఆయనకు చంద్రబాబు ఏ పదవి కేటాయిస్తారు అనేది తేలాల్సి ఉంది.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!
Advertisement

తాజా వార్తలు