కేసిఆర్ కి అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రిక..!!

జనవరి 22వ తారీకు అయోధ్య( Ayodhya Ram Mandir )లో శ్రీరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది.

ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ( Narendra Modi ) ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు.

ఎన్నో సంవత్సరాల హిందువుల కలయినటువంటి ఈ రామ మందిరం ఏర్పాట్లకు అన్ని పూర్తి కావడం జరిగింది.ఈనెల 22వ తేదీ దేశ విదేశాల అతీరథ మహారాధుల సమక్షంలో ఈ ఆలయం ప్రారంభం కాబోతోంది.

ఈ క్రమంలో దేశంలో చాలామంది ప్రముఖులకు శ్రీరామ జన్మభూమి తీర్థయాత్ర ట్రస్ట్ సభ్యులు ఆహ్వాన పత్రికలు పంపించి కార్యక్రమంలో పాల్గొనాలని తెలియజేస్తున్నారు.దీనిలో భాగంగా మాజీ సీఎం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కి ఆహ్వాన పత్రం పంపించడం జరిగింది.

కాగా కొన్ని వారాల క్రితం కేసీఆర్( Kcr ) ఫామ్ హౌస్ లో జారి పడటం తెలిసిందే.దీంతో ఆయన తుంటి ఎముక ఫ్రాక్చర్ కావడం జరిగింది.

Advertisement

వెంటనే సామాజిగూడలోని యశోద ఆసుపత్రిలో.జాయిన్ చేసి ఎముక ఆపరేషన్ చేయడం జరిగింది.

ఆ సమయంలో 8 వారాలు పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించడం జరిగింది.దీంతో ప్రస్తుతం బంజారా హిల్స్ నంది నగర్ నివాసంలో కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఈ క్రమంలో కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.

Boyle Sports Customer Support And Service Quality : A Practical Guide For UK Players
Advertisement