రాత్రి భోజనానికి బరువు పెరగడానికి ఏం సంబంధం ఉందో తెలుసా..?

ప్రస్తుత సమాజంలో ప్రజలు అనుభవిస్తున్న అతిపెద్ద సమస్యలలో ఊబకాయం( Obesity ) ఒకటి అని ఖచ్చితంగా చెప్పవచ్చు.అనేకమంది ఉండాల్సిన దానికన్నా అధిక బరువు పెరుగుతున్నారు.

ఇది వ్యక్తుల జీవనశైలి, నిద్ర, విధానాలు తినే ఆహారం పై ఆధారపడి ఉంటుంది.ఒకసారి బరువు పెరిగితే దానిని అదుపు చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది.

సాధారణంగా బరువు అదుపు చేయడానికి అందరూ ఉదయం సమయంలో అల్పాహారం సక్రమంగా తీసుకోవాలి అని చెబుతూ ఉంటారు.కానీ మీరు చేసే రాత్రి భోజనం( Dinner ) శరీర బరువుపై చాలా ఎక్కువ ప్రభావం చూపుతోందని చాలామందికి తెలియదు.

ఇప్పుడు రాత్రి సమయంలో ఏం తినాలి.ఏం తినకూడదు.ఎంత తినాలి.

Advertisement

ఏ సమయంలో తినాలి.ఏంటి అని అనుమానాలు సందేహాలు చాలా మందిలో ఉంటాయి.

ఈ నేపథ్యంలో సాధారణంగా చాలామంది రాత్రి ఆహారం విషయంలో చేసే తప్పులు, వాటి వల్ల కలిగే నష్టాలు, నివారణ పద్ధతులను ఇప్పుడు మనం తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే రాత్రి భోజనాన్ని వీలైనంతవరకు లైట్ గా ఉండడమే మంచిది.

వాస్తవానికి రోజు కరిగే కొద్ది మన జీవక్రీయ మందగిస్తుంది.నిజానికి జీవక్రియను ప్రోత్సహించే ప్రతి ఆహారం బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.

అందుకే రాత్రి భోజనంలో సలాడ్‌లు, సూప్‌లు లేదా కాల్చిన కూరగాయలు వంటి వాటిని తీసుకోవడం మంచిది.

jamuna, Relangi : రేలంగి మాటలకు హీరోయిన్ జమున జంప్..కారణం ఏంటి ?

ఇంకా చెప్పాలంటే రాత్రి భోజనం త్వరగా చేయడం వల్ల రాత్రి పూట ఎక్కువసేపు ఖాళీ కడుపుగా ఉంటుంది.ఇది కొవ్వు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.మీకు ఆరోగ్యకరమైన వాటిని రాత్రి సమయంలో ఆహారంగా తీసుకోవాలి.

Advertisement

అధిక కేలరీలు( Calories ) ఉన్న ఆహారం తీసుకుంటే బరువు పెరిగేందుకు కారణం అవుతుంది.అలాగే సులభంగా బరువు తగ్గడానికి ప్రోటీన్, ఫైబర్ బాగా ఉపయోగపడతాయి.

ఈ పోషకాలను నిర్లక్ష్యం చేయడం వల్ల మీ జీవక్రియ మందగిస్తుంది.ప్రోటీన్ ఫైబర్ రెండు మీకు ఎక్కువ కాలం కడుపు నిండుగా ఉండే అనుభూతిని కలిగిస్తాయి.

ఇంకా చెప్పాలంటే రాత్రి పూట అధిక ఉప్పును అస్సలు తినకూడదు.

తాజా వార్తలు