కావాలి బీజేపీ రావాలి కిషన్ ! ఆయన వెంటపడుతున్న వైసీపీ

వైసీపీ మీద ఏపీ బిజెపి నాయకులు ఎంత ఘాటు విమర్శలు చేసిన ఎన్ని నిందలు వేసినా వైసీపీ నాయకులు మాత్రం మిగతా పార్టీలను విమర్శించిన అంత స్థాయిలో బిజెపి జోలికి వెళ్ళలేక పోతున్నారు.

ఆ పార్టీ నేతలు వైసీపీని ఎంత దూరం పెడతామని చూస్తున్నా వీరు మాత్రం దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

కేంద్రంలో లో అధికారంలో ఉన్న పార్టీతో విభేదాలు పెట్టుకుంటే రాష్ట్ర అభివృద్ధి తో పాటు పార్టీ పరంగా కూడా చాలా ఎదురు దెబ్బలు తినాలని వైసిపి నాయకులు పసిగట్టారు.దీనికి ఉదాహరణగా తెలుగుదేశం పార్టీని వారు గుర్తు చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో బిజెపికి దగ్గరయ్యేందుకు ప్రతి సందర్భంలోనూ వైసిపి ప్రయత్నిస్తుంది.జగన్ కూడా పదేపదే ఢిల్లీ వెళ్లి కేంద్ర బిజెపి పెద్దల ను ప్రసన్నం చేసుకుంటున్నాడు.

Avanthi Srinivas And Dhronam Raju Srinivas Comments On Kishan Reddy

ప్రస్తుతం తెలంగాణ ప్రాంతానికి చెందిన బిజెపి కేంద్ర మంత్రి హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని ప్రసన్నం చేసుకునే పనిలో వైసిపి ఉంది.విశాఖలో ఓ కార్యక్రమంలో కిషన్ రెడ్డి మీద వైసిపి నాయకులు ప్రశంసలు వర్షం కురిపించారు.మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్యెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ తదితరులు కిషన్ రెడ్డి క్రమశిక్షణ కలిగిన నాయకులు అంటూ వారు ఓ రేంజ్ లో పొగిడేశారు.

Advertisement
Avanthi Srinivas And Dhronam Raju Srinivas Comments On Kishan Reddy-కావ�

అంతేకాకుండా కిషన్ రెడ్డికి ఆత్మీయ సన్మానం ఏర్పాటు చేసి అతిధి మర్యాదలకు ఎక్కడా లోటులేకుండా చూస్తున్నారట.ఆర్కే బీచ్ లో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

Avanthi Srinivas And Dhronam Raju Srinivas Comments On Kishan Reddy

అయితే ఆ కార్యక్రమానికి ఒకరోజు ముందే కిషన్ రెడ్డి వచ్చేలా బిజెపి కీలక నాయకుడు సోము వీర్రాజు ద్వారా వైసీపీ నాయకులు ప్రయత్నించారు.కిషన్ రెడ్డి అంటే ప్రస్తుతం అమిత్ షా దగ్గర డిప్యూటీ గా ఉన్నారు చాలా కాలంగా జగన్ అమిత్ షా తో బేటీ ఎందుకు ప్రయత్నిస్తున్నారు.అయినా అమిత్ షా వైసిపి విషయంలో పెద్దగా ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా కనిపించడం లేదు.

అందుకే కిషన్ రెడ్డిని తమకు అనుకూలంగా మార్చుకుని అమిత్ షా తో సన్నిహిత సంబంధాలు పెట్టుకోవాలని వైసీపీ నాయకులు తాపత్రయపడుతున్నట్టు అర్ధం అవుతోంది.అయితే కిషన్ రెడ్డి వైసీపీ విషయంలో సానుకూలంగా ఉన్నా బీజేపీ పెద్దలు మాత్రం సానుకూలంగా ఉంటారా అనేదే తేలాల్సి ఉంది.

తాజా వార్తలు