Atchannaidu : ఎలక్షన్ కమిషన్ కి లేఖ రాసిన అచ్చెన్నాయుడు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.

ఈ క్రమంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు( Atchannaidu ) ఈసీకి లేఖ రాయడం జరిగింది.

విషయంలోకి వెళ్తే ఎలక్షన్ లో ఓటర్లకు మద్యం పంపిణీ చేసేందుకు వైసీపీ నాయకులు ఇప్పటికే పెద్ద ఎత్తున స్టాక్ పెట్టుకుంటున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.వారికి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్, ఎక్సైజ్ శాఖ, పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ మేరకు ఎన్నికల సంఘానికి లేక ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది.

బేవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిని బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు.మద్యం డిస్టిలరీలు అధికంగా వైసీపీ నేతల ఆధీనంలో ఉన్నాయి.ఎన్నికల్లో ఓటర్లకు మద్యం పంపిణీకి భారీగా స్టాక్ పెట్టుకున్నారు.

Advertisement

ప్రభుత్వానికి బేవరేజస్ కార్పొరేషన్ సహకరిస్తోంది.మద్యం మాఫియాతో వాసుదేవరెడ్డికి సంబంధాలున్నాయి.

మద్యం అమ్మకాలు, రవాణాపై నిఘా పెట్టాలి అని కోరారు.రాష్ట్రంలో జరుగుతున్న లిక్కర్ కుంభకోణంలో వాసుదేవ రెడ్డి కీలకపాత్ర పోషిస్తున్నారు.

రానున్న ఎన్నికలు ప్రశాంతంగా జరగాలంటే లిక్కర్ మాఫియాతో సంబంధాలు ఉన్న అతడిని వెంటనే బదిలీ చేయాలి.అధికార పార్టీ నాయకులు దాచిపెట్టిన మద్యం స్టాక్ లపై దాడులు చేసి సీజ్ చేయాలి.

అని లేఖలో పేర్కొన్నారు.

చుండ్రుతో తీవ్రంగా స‌త‌మ‌తం అవుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకే!
Advertisement

తాజా వార్తలు