తన గోతి తానే తీసుకున్న జ్యోతిష్యుడు మురళీకృష్ణ.. వెలుగులోకి వస్తున్న అక్రమాలు.. !!

సొసైటీలో పెద్ద మనుషులుగా చలామని అవుతూ చీకటి కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారెందరో ఉన్నారు.వీరంతా దొరికే వరకు దొరలుగా, దొరికినాక దొంగలుగా లోకానికి తెలుస్తున్నారు.

ఇక జ్యోతిష్యం ముసుగులో ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి.కానీ ఇందులో చాలావరకు బయటకు రానీ దారుణాలు ఎన్నో.

Astrologer Murali Krishna Counterfeit Notes Case, Astrologer Muralikrishna, 18 C

ఇకపోతే మురళీకృష్ణ శర్మ అనే జ్యోతిష్యుడు తన గోతి తానే తీసుకున్నాడు.తన ఇంట్లో రంగురాళ్లు, కొంత నగదు చోరీకి గురయ్యాయంటూ పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులకు దిమ్మతిరిగే నిజాలు తెలిసి విస్తుపోతున్నారట.అదేమంటే చోరికి గురైన నగదు నకిలీ నోట్లని తేలడంతో ఆయన ఇంట్లో నిర్వహించిన తనిఖీల్లో రూ.18 కోట్ల విలువైన నకిలీ నోట్లు, రూ.6 లక్షల విలువైన నగదు లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు.అదీగాక గతంలో మురళీకృష్ణ పై హవాలా కేసు నమోదైందని, జైలుకు కూడా వెళ్లి వచ్చినట్టు, ఇక టీవీ చానళ్ల ప్రకటనల ద్వారా పలువురికి నకిలీ రంగురాళ్లు విక్రయించినట్టు తేలిందట.

కాగా ఇతను చదివింది పదో తరగతే అయినా మోసాలకు పాల్పడుతూ కోట్ల రూపాయలకు పడగలెత్తాడట.అయినా ప్రజలు గొర్రెల్లా జీవిస్తుంటే ఇలాంటి దోపిడి దారులు దోచుకోకుంటే ఏం చేస్తారు.

Advertisement

ప్రజల మూఢ నమ్మకాలే వీరికి పెట్టుబడులుగా మారడంలో వింతే ముంది.

యవ్వనంలో వచ్చే సమస్యలకు పరిష్కారం...తులసి
Advertisement

తాజా వార్తలు