అసిన్ మోసగత్తె అంటూ ప్రముఖ నటుడు సంచలన వ్యాఖ్యలు.. అసలేం జరిగిందంటే?

హీరోయిన్ అసిన్( Heroine Asin ) గురించి మనందరికీ తెలిసిందే.ఒకప్పుడు ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది అసిన్.

సౌత్ అలాగే నార్త్ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తర్వాత స్టార్ స్టేటస్ ను అందుకున్న ఈ ముద్దుగుమ్మ సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేసింది.

అసిన్ నటించిన మొదటి సినిమా మలయాళంలో నరేంద్రన్ మకన్ జయకాంతన్ వకా.ఈ మూవీ 2001లో రిలీజ్ అయి సూపర్ హిట్ గా నిలిచింది.అసిన్ నటించిన మొదటి సినిమా హిట్ అవ్వడంతో ఆమె సినిమాలోనే ఉండిపోయింది.

ఆ తర్వాత ఆమెకు చాలా అవకాశాలు వచ్చాయి.

Advertisement

సౌత్ స్టార్ నటిగా ఉన్న అసిన్‌కు బాలీవుడ్‌ లో( Bollywood ) కూడా చాలా అవకాశాలు వచ్చాయి.మొదట బాలీవుడ్‌ లో వచ్చిన చిన్న చిన్న అవకాశాలన్నీ రిజెక్ట్ చేసింది అసిన్.కానీ ఆ తర్వాత ఆ కాలం సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్‌ లతో కలిసి నటించి బాలీవుడ్‌ లో కూడా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

తర్వాత అసిన్ జీవితంలో ఆ సమయంలో ప్రేమ వచ్చింది.బాలీవుడ్ నటుడు నితిన్ ముఖేష్‌ తో( Nitin Mukesh ) ప్రేమలో పడిన అసిన్ డేటింగ్ చేసింది.

కానీ ఆ విషయం మీడియాకు తెలియకూడదని నటుడు నితిన్‌ కు నటి అసిన్ కండిషన్ పెట్టిందట.

ఆమెకు చాలా దగ్గరగా ఉన్న నితిన్ ముఖేష్ చాలా పొసెసివ్‌ గా ఉండేవాడట.అదే సమయంలో నటి అసిన్ నటులైన సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్‌ లతో సినిమాలో నటిస్తున్నప్పుడు చాలా క్లోజ్‌గా ఉండేదట.దీంతో కోపగించిన నటుడు నితిన్ ముఖేష్, ప్రెస్ మీట్ పెట్టి నటి అసిన్ గురించి మాట్లాడి వాళ్లిద్దరూ డేటింగ్ చేస్తున్న విషయాన్ని లీక్ చేసేశాడట.

స‌మ్మ‌ర్‌లో బీర‌కాయ తింటే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?

అయితే ప్రెస్ మీట్‌ లో నటుడు నితిన్ అసిన్ ఒక మోసగత్తె.ఆమె నా దగ్గర చాలా సహాయం తీసుకుంది.నేను ఆమెకు చాలా డబ్బు సహాయం కూడా చేశాను.

Advertisement

కానీ ఇప్పుడు ఆమె అందనంత ఎత్తులో ఉంది అని చెప్పాడు.దాంతో వాళ్లిద్దరి లవ్ స్టోరీ కాస్త అక్కడితో ముగిసింది.

ఆ సమయంలో అసిన్ నటించిన బాలీవుడ్ సినిమా కూడా సరిగ్గా ఆడలేదట.కొద్ది రోజుల్లోనే నటి అసిన్ బాలీవుడ్‌లో పక్కకు వెళ్ళిపోయింది.

ఆ తర్వాత, సల్మాన్ ఖాన్, నటుడు అక్షయ్ కుమార్ సినిమా తర్వాత ఆమెకు బాలీవుడ్‌ లో అవకాశాలు పూర్తిగా కరువు అయ్యాయి.

తాజా వార్తలు