బారాసతో పొత్తుపై అరవింద్ కన్ఫర్మ్ చేసినట్టేనా?

బారాస కు సరైన ప్రత్యామ్నాయం మేమే అంటూ ఇంతకు ముందు వరకూ చెప్పిన భాజపా ,తీరా ఎన్నికల సమయం వచ్చినప్పటికీ చేతులు ఎత్తేసింది.

అనూహ్యం గా కాంగ్రెస్ పుంజుకోవడం, బజాపా లోని కీలక నేతలు కూడా కాంగ్రెస్ దారి పట్టడంతో ఇప్పుడు అధికార బారాస కాంగ్రెస్ ల మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది .

అయితే ఇప్పుడు తాము కింగ్ అవ్వలేక పోయినా కింగ్ మేకర్లమవుతామంటూ బిజెపి( BJP )కొత్త పల్లవి అందుకుంది.కీలకమైన కొన్ని సీట్ల ను గెలిచి అధికారాన్ని నిర్ణయించే స్తాయి కి వెళ్తామని ఇప్పుడు బిజేపి నేతలు చెప్తున్నారు

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్( Dharmapuri Arvind )అయితే ఈ పార్టీ తో కలసి నడుస్తారో తెలిసేలా కొన్ని నర్మ గర్బ వ్యాఖ్యలు చేశారు.తాము ఎవరితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలో కూడా ఆయన సూచనప్రాయంగా వెల్లడించినట్లుగా తెలుస్తుంది.రేవంత్ రెడ్డితో పోలిస్తే కేసీఆర్ మంచోడంటూ ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు భాజపా భవిష్యత్తు రాజకీయానికి అద్దం పట్టే విధంగా ఉన్నాయని తెలుస్తుంది.

ఆయన గత కొన్ని రోజులుగా అధికార బారాసా కంటే కాంగ్రెస్ ని విమర్శించడానికె ఎక్కువ ప్రయారిటీ ఇవ్వటం, కేసీఆర్ అవినీతితో పోలిస్తే రేవంత్ రెడ్డి( Revanth Reddy ) చాలా అవినీతిపరుడు అని చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే రాష్ట్రంలో హంగ్ పరిస్థితి వస్తే ,భాజపా బారాస జుట్టు కడుతుంది అన్న విషయాన్ని ఆయన కన్ఫర్మ్ చేస్తున్నట్లే తెలుస్తుంది.

Advertisement

అయితే ఇవి ఎంపీ గారి వ్యక్తిగత వ్యాఖ్యలో లేదా పార్టీ పార్టీ పరమైన వ్యాఖ్యలో మాత్రం ఆయన స్పష్టత ఇవ్వడం లేదు.ఏది ఏమైనా తెలంగాణలో సాధారణ ప్రజల అభిప్రాయం కూడా ఎన్నికల తర్వాత భాజపా బారస జట్టు కడతాయనే కోణంలోనే ఉన్నాయి నిజామాబాద్ మాజీ ఎంపి ,కేసీఆర్ కుమార్తె శ్రీమతి కవిత లిక్కర్ స్కాం కేసు( Kavitha Liquor Scam Case ) లో తదుపరి చర్యలు ఏమి జరగకపోవడంతో తెరవెనక ఒప్పందం కుదిరింది అన్న వ్యాఖ్యలకు బీజం పడింది.ఇప్పుడు అరవింద వ్యాఖ్యలు వాటిని కన్ఫర్మ్ చేసినట్లుగానే రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 1, శనివారం, 2021
Advertisement

తాజా వార్తలు