చంద్రబాబు ఏపీలో జగన్ రెడ్డి కి షాకుల మీద షాకులు ఇస్తుంటే.
కేంద్రం మాత్రం నువ్వు కూడా రుచి చూడు అంటూ మరిన్ని షాకులు ఇస్తోంది చంద్రబాబు కి.
పోలవరం ప్రాజెక్ట్ పనులు ఆపాలని మొన్నటికి మొన్న లేఖ పంపిన విషయం తెలిసిందే.ఈ విషయం లో కేంద్రం రాజకీయంగా దెబ్బ తీస్తూ షాక్ ఇస్తే.
గుజరాత్ ఎన్నికల విజయం తరువాత ఏపీ బిజెపి చంద్రబాబుని విమర్శిస్తూ మొన్న షాక్ ఇచ్చింది.మిత్ర పక్షం కదా అని చంద్రబాబు కూడా చూసి చూడనట్టుగా తన టిడిపి నేతలకి కూడా బిజెపి పై విమర్శలు చేయకండి అంటూ సైలెంట్ అయ్యారు.
ఇన్ని జరిగినా సరే బిజేపి నేతలతో సంధి కుదుర్చుకుని కేంద్రానికి పోలవరం మీద ఉన్న అపోహలు తోలిగించేలా మాట్లాడమని.సవివరంగా ఏపీ బిజేపి నేతలకి తెలిపారు.
అయితే ఈ విషయంలో ఏపీ బిజెపి కేంద్రంలో గడ్కరీని.ఉపరాష్ట్రపతి వెంకయ్యని కలిసారు.
ఏపీ సీయం కి సాయం చేయాలని ఎప్పటి నుంచో ఉన్న భందాన్ని గుర్తు చేసుకున్న వెంకయ్య.గడ్కరికీ సమస్యని పరిష్కరించాలి అని సూచించారు.
సీన్ కట్ చేస్తే బిజెపి నాయకులు చివరిగా అరుణ్ జైట్లీని కలిశారు.ప్రస్తుత ఏపీ పరిస్థితులపై చర్చించారు.
పోలవరం విషయంలో బాబు చెప్పింది చెప్పారో లేదో కానీ చెప్పాము అని మీడియాకి తెలిపారు.అయితే అయితే ఈ సందర్భంగా జైట్లీ పోలవరం ప్రాజెక్టుపై స్పందించారు.
పోలవరం ప్రాజెక్టుకు చట్ట ప్రకారం నిధులు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.రెవెన్యూ లోటు భర్తీ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
పోలవరంకు నిధులు.లోటు భర్తీతో పాటు ప్రత్యేక ప్యాకేజీ అంశాలు కూడా వారి మధ్య చర్చకు వచ్చాయి.
అయితే అరుణ్ జైట్లీ ఇక్కడే ఒక మెలిక పెట్టారు.అంతా బాగానే ఉంది అల్లుడి నోట్లో శని అన్నట్లుగా అప్పటి వరకూ నాయకులు చెప్పిన మాటలు శ్రద్దగా విన్న జైట్లీ.
అంతా బాగుంది సాయం చేస్తాం కానీ కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ లెక్కలకు వ్యత్యాసం వస్తోందని.అంటూ బాబు కి మరో షాక్ ఇచ్చారు.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చిన లెక్కలపై కేంద్రం అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలిపారు.మరి ఈ అసంతృప్తి రాజకీయ లబ్దికోసం వచ్చిందా లేక మరే ఇతరకారణాల అనేది తెలియలేదు కానీ.
చంద్రబాబు ని మత్రం బిజేపి ప్రభుత్వం ముప్పు తిప్పలు పెడుతోంది అనేది మాత్రం వాస్తవం.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy