Arun govi : ఆదిపురుష్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన అలనాటి రాముడు.. దాన్ని నేను అంగీకరించను అంటూ?

ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన తాజా చిత్రం ఆదిపురుష్‌( Adipurush ).

తాజాగా జూన్ 16న భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఒక కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతుండగా మరోవైపు ఈ సినిమాపై కోర్టులో కేసులు నెగిటివ్ కామెంట్స్ విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి.

మూవీ విడుదల అయి మూడు రోజులు అవుతున్న ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతూనే ఉన్నాయి.ఇందులో చాలా సన్నివేశాలపై పాత్రల చిత్రీకరణ, సంభాషణలను వ్యతిరేకిస్తూ పలువురు సినీ రాజకీయ ప్రముఖులు, సినీ ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ చర్చలో భాగమయ్యారు అలనాటి రామాయణ్‌ ధారావాహిక రాముడి పాత్రధారి అరుణ్‌ గోవిల్‌ ( Arun govi ) తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న భాగంగా ఆదిపురుష్‌ సినిమాపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.అయితే ఈ సినిమా టీజర్‌ విడుదలైనప్పుడు చిత్రబృందానికి తాను కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చానని తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రామాయణం( Ramayana ).మన విశ్వాసానికి సంబంధించిన విషయం.దాని రూపాన్ని తారుమారు చేయడం ఆమోదయోగ్యం కాదు.

విజువల్‌ ఎఫెక్ట్స్‌ను పక్కన పెడితే పాత్రల చిత్రీకరణ ముఖ్యమైన విషయం.

Advertisement

దాన్ని సీరియస్‌గా తీసుకోవాలి.ఈ చిత్రాన్ని నేనింకా చూడలేదు కానీ.ఆన్‌లైన్‌లో వస్తోన్న వీడియోలు చూశా.

రామాయణం సినిమాలో ఇలాంటి భాషను నేను అసలు అంగీకరించను.ఇన్నాళ్లుగా మనందరికీ తెలిసిన రామాయణ వర్ణనలో తప్పు ఏముంది? విషయాలు మార్చాల్సిన అవసరం ఏముంది? బహుశా, చిత్రబృందానికి సీతారాములపై సరైన అవగాహన లేదు.అందుకే ఈ మార్పులు చేశారు అని ఆయన తెలిపారు.

ఇకపోతే రామానంద్‌ సాగర్‌ తీసిన రామాయణ్‌ సీరియల్ లో అరుణ్‌ గోవిల్‌ రాముడి పాత్ర పోషించారు.ఆ సీరియల్ విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు.

Aussie Play Review And Player Reputation (AU) — Aussie Play Explained For Australian Punters
Advertisement

తాజా వార్తలు