ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు నేటి నుంచి బంద్..!!

ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు ఇవాళ్టి నుంచి నిలిచిపోనున్నాయని తెలుస్తోంది.

పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆరోగ్య శ్రీ ట్రస్ట్ అధికారులు, ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్( AP Specialty Hospitals Association ) ప్రతినిధుల మధ్య చర్చలు సఫలం కాలేదని సమాచారం.

ఇప్పటికే ప్రకటించిన విధంగా అసోసియేషన్ సభ్యత్వం కలిగిన ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలను బంద్ చేస్తున్నట్లు తెలిపారు.అయితే నిన్న రాత్రి ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ తో ఆరోగ్య శ్రీ( Arogya Sri ) సీఈవో భేటీ అయ్యారు.

ఈ క్రమంలోనే సీఈవో మాట్లాడుతూ బిల్లుల చెల్లింపులపై చర్యలు చేపట్టామన్నారు.పెండింగ్ నిధులు విడుదల చేస్తామని ఆరోగ్య శ్రీ సీఈవో హామీ ఇచ్చారు.

అయితే నిధులు ఇంకా రాలేదని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ అధికారులు తెలిపారు.కాగా సుమారు రూ.1,500 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని ఆస్పత్రులు వెల్లడిస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే బిల్లులు వచ్చేంత వరకు కొత్త కేసులను తీసుకోమని ఆస్పత్రులు తెలిపాయి.

Advertisement
గ‌ర్భిణీల్లో విట‌మిన్ ఎ లోపం ఎన్ని అన‌ర్థాల‌కు దారితీస్తుందో తెలుసా?

తాజా వార్తలు