అర్జున్‌ రెడ్డి డైరెక్టర్‌ గాలి మేడలన్నీ కూలిపోయాయి

విజయ్‌ దేవరకొండతో అర్జున్‌ రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించిన సందీప్‌ రెడ్డి వంగ మొదటి సినిమాతో క్రేజ్‌ అమాంతం పెరిగింది.

అర్జున్‌ రెడ్డిని బాలీవుడ్‌లో కబీర్‌ సింగ్‌గా రీమేక్‌ చేశాడు.

కబీర్‌ సింగ్‌ కూడా సూపర్‌ హిట్‌ అవ్వడంతో ఈయనపై స్టార్స్‌ పలువురు ఆసక్తి చూపించారు.ముఖ్యంగా బాలీవుడ్‌ స్టార్స్‌ ఈయనతో సినిమాలు చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.

దాంతో ఈయన చిన్న హీరోలను అస్సలు పట్టించుకోలేదు.

పెద్ద హీరోలు ఛాన్స్‌ ఇవ్వక చిన్న హీరోలతో సినిమా చేసేందుకు మనసు ఒప్పుకోక మళ్లీ తెలుగులోనే సందీప్‌ రెడ్డి తన తదుపరి చిత్రాన్ని చేసేందుకు సిద్దం అవుతున్నాడు.గతంలో ఈయన మహేష్‌బాబుకు కథ చెప్పాడు అంటూ వార్తలు వచ్చాయి.కాని మహేష్‌బాబు ప్రస్తుతం ఈయకు డేట్స్‌ ఇచ్చే మూడ్‌లో లేడు.

Advertisement

ఈయన వరుసగా వేరే సినిమాలు చేసేందుకు కమిట్‌ అయ్యి ఉన్నాడు.కనుక సందీప్‌ కొత్త హీరోలను చూసుకోవాల్సిందే అంటున్నారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ టీసిరీస్‌ వారు సందీప్‌ రెడ్డితో రెండు సినిమాలు నిర్మించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.కాని ఇప్పటి వరకు కనీసం ఒక్క సినిమా కూడా సందీప్‌ మొదలు పెట్టక పోవడంతో వారు తీవ్ర నిరాశలో ఉండి వారి కాంట్రాక్ట్‌ను క్యాన్సిల్‌ చేసుకోవాలని భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.దాంతో ఆయన ఎంతో ఊహించుకుంటే మొత్తం గాలి మేడలా కూలిపోతుంది అంటూ నెటిజన్స్‌ జోకులు వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు