మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఖిలాడి ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాను దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాను పూర్తి క్రైమ్ థ్రిల్లర్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇటీవల క్రాక్ చిత్రంతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న రవితేజ మరోసారి ఖిలాడి చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు.
కాగా ఈ సినిమాలో రవితేజ డ్యుయెల్ రోల్‌లో నటిస్తుండగా, ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.అయితే ఈ సినిమా షూటింగ్‌లో అర్జున్ తాజాగా జాయిన్ అయినట్లు చిత్ర యూనిట్ తెలియజేసింది.
యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు, ఆయన పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను మరోసారి మెస్మరైజ్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.ఇక ఈ సినిమాలో రవితేజ, అర్జున్‌ల మధ్య వచ్చే సీన్స్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్తాయని చిత్ర యూనిట్ అంటోంది.
మొత్తానికి నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం తరువాత అర్జున్ ఖిలాడి సినిమాలో నటిస్తుండటంతో, ఈ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉంటుందా అని ప్రేక్షకులు, ఆయన అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.ఇక ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.
ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది.అయితే ఈ సినిమాతో రవితేజ తన క్రాక్ సక్సె్స్‌ను కంటిన్యూ చేస్తాడా లేడా అనేది ఆసక్తికరంగా మారింది.
మరి ఖిలాడి చిత్రం ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy