వాట్సాప్ మెసేజ్‌ల విషయంలో గొడవ.. రోడ్డుపై ఎంత భయంకరంగా కొట్టుకున్నారో చూడండి..

ఈరోజుల్లో స్కూల్ స్టూడెంట్ల మధ్య ఫైట్స్‌ ఎక్కువగా జరుగుతున్నాయి.వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అవి చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

ఒకరినొకరు చంపేసుకునేలా, రౌడీల్లా వారు కొట్టుకుంటున్న తీరు చూసి ఆందోళన చెందుతున్నారు.తాజాగా అలాంటి మరో స్కూల్ ఫైటింగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Argument Over Whatsapp Messages See How Badly Beaten Up On The Road , School Fig

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోని అమిటీ యూనివర్శిటీ ( Amity University, Noida )విద్యార్థుల మధ్య ఈ గొడవ జరిగింది.సోషల్ మీడియాలో దీనికి సంబంధించి 2 క్లిప్స్‌ హల్‌చల్ చేస్తున్నాయి.మొదటి వీడియోలో, ఒక బాయ్ స్టూడెంట్, ఒక ఫిమేల్ స్టూడెంట్‌ తీవ్రమైన వాగ్వాదం పెట్టుకోవడం చూడవచ్చు.

తరువాత వారు ఒకరినొకరు చెంప దెబ్బలు కొట్టుకున్నారు.వాట్సాప్ చాట్‌ల( WhatsApp chats ) విషయంలో వీరిద్దరూ గొడవ పడినట్లు సమాచారం.

Advertisement
Argument Over WhatsApp Messages See How Badly Beaten Up On The Road , School Fig

నన్నే కొడతావా అని సదరు ఫిమేల్ స్టూడెంట్ తన మగ స్నేహితులను పిలిచింది.ఆ తరువాత వారు సదరు మేల్ స్టూడెంట్‌ను చితక్కొట్టుడు కొట్టారు.

గుద్దుతూ, తన్నుతూ, రోడ్డు మీద పడేస్తూ, గోడకు నూకేస్తూ ఆ లేడీ స్టూడెంట్ ఫ్రెండ్స్ రెచ్చిపోయారు.ఒక ఫ్రెండ్ అయితే బాక్సింగ్ లోలాగా పంచులు కురిపిస్తూ సదరు బాయ్ స్టూడెంట్ కు చుక్కలు చూపించాడు.

ఆ దెబ్బలకు చనిపోతాడేమో అని చాలామంది చూసి షాక్ అయిపోయారు.ఒక యువతి వచ్చి వారిని ఆపింది.

లేకుంటే వీరు అతడిని చంపేసినా చంపేసేవారు.ఈ దృశ్యాలన్నీ మరో వీడియోలో రికార్డ్ అయ్యాయి.

30 ఏళ్లకే ముసలివారిలా కనిపిస్తున్నారా.. యంగ్ అండ్ గ్లోయింగ్ స్కిన్ కోసం ఇలా చేయండి!

అది కూడా వైరల్ అవుతోంది.చాలామంది నెటిజన్లు ఇంతలా కొట్టేలా స్నేహితులను రెచ్చగొట్టిన అమ్మాయిని తిట్టిపోస్తున్నారు.

Advertisement

ఈ షాకింగ్ వీడియోను మీరు చూసేయండి.

తాజా వార్తలు