పార్లమెంట్‎లో అదానీ వ్యవహారంపై రగడ

రెండో విడత పార్లమెంట్‎ బడ్జెట్ సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది.మరోవైపు అదానీ వ్యవహారం పార్లమెంట్ ఉభయసభలను కుదిపేసింది.

లోక్ సభలో హిండెన్ బర్గ్ నివేదికపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి.ఈ అంశంపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది.

హిండెన్ బర్గ్ నివేదికపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ( జేపీసీ)ని ఏర్పాటు చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.అయితే మొదట క్వశ్చన్ అవర్ కొనసాగేలా చూడాలని, నిబంధనల మేరకు ప్రతి అంశంపై చర్చించేందుకు సమయం ఇస్తామని స్పీకర్ ఓం బిర్లా విపక్షాలను విజ్ఞప్తి చేశారు.

ఈ నేపథ్యంలో గందరగోళం నెలకొంది.మరోవైపు రాజ్యసభలోనూ అదానీ వ్యవహారంపై చర్చించాలని ప్రతిపక్షాలు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టాయి.

Advertisement

హిండెన్ బర్గ్ అంశంపై చర్చించాలని బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు వాయిదా తీర్మానం ఇచ్చారు.అయితే విపక్షాల ఆందోళనల నేపథ్యంలో రాజ్యసభ సైతం వాయిదా పడింది.

60 ఏనుగుల ప్రాణాలు కాపాడిన ఏఐ.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు